ETV Bharat / bharat

విదేశీ టీకాలకు అనుమతులపై రాహుల్ చురక! - విదేశీటీకాలకు అనుమతించిన కేంద్రం

విదేశీ కరోనా టీకాలకు అనుమతులు ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ స్పందించారు. మహాత్మా గాంధీ సూక్తిని ప్రస్తావిస్తూ.. కేంద్రంపై విమర్శలు సంధించారు. 'మొదట నిన్ను పట్టించుకోరు. కానీ, ఆఖరికి నువ్వే గెలుస్తావు' అంటూ ట్వీట్ చేశారు.

Rahul Gandhi
రాహుల్​ గాంధీ
author img

By

Published : Apr 14, 2021, 4:47 PM IST

విదేశీ కరోనా టీకాలకు భారత్​లో త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడంపై రాహుల్​ గాంధీ వ్యంగస్త్రాలు సంధించారు. మహాత్మా గాంధీ సూక్తిని ప్రస్తావిస్తూ.. కేంద్రంపై విమర్శలు చేశారు.

"మొదట నిన్ను పట్టించుకోరు. తర్వాత నిన్ను చూసి నవ్వుతారు. ఆ తర్వాత నీపై పోరాడతారు. కానీ ఆఖరికి నువ్వే గెలుస్తావు."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

విదేశీ కరోనా టీకాలకు అత్యవసర అనుమతివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి.. రాహుల్​ గాంధీ శుక్రవారం లేఖ రాశారు. అయితే ఫార్మా కంపెనీల కోసం లాబీయింగ్ చేస్తూ.. ఏకపక్షంగా అనుమతివ్వాలని రాహుల్​ కోరుతున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ విమర్శించారు. ఈ నేపథ్యంలో విదేశీ టీకాలకు అనుమతులపై ఓ వార్తా కథనాన్ని ఉటంకిస్తూ ట్వీట్ చేశారు రాహుల్.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియ మరింత వేగవంతం చేయడం కోసం విదేశాలలో అత్యవసర అనుమతి పొందిన ఫైజర్​, జాన్సన్​ అండ్​ జాన్సన్​ వంటి టీకాలకు భారత్​లోనూ అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది.

'మోదీ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తోంది'

కరోనా కేసులు పెరుగుతుంటే వాటిని కట్టడి చేయడంలో ప్రధాని మోదీ నిర్లక్ష్యం వహిస్తున్నారని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా మండిపడ్డారు. వైరస్​ కేసుల్ని గుర్తించడంలో మోదీ పట్టనట్టు ఉన్నారని, కనీసం సానుభూతి కూడా లేకుండా ప్రజల ప్రాణాల్ని ప్రమాదంలో పడేశారని విమర్శించారు.

"కొవిడ్​-19 కేసుల్ని గుర్తించడంలో ప్రధాని మోదీ పూర్తి నిర్లక్ష్యంగా, ఎటువంటి సానుభూతి లేకుండా, క్రూరంగా ఉన్నారు. అంతేకాకుండా ప్రాణాల్ని కాపాడాల్సిన మందుల విషయంలో, ఆసుపత్రుల్లో ఆక్సిజన్​, పడకలు, వైద్యసంబంధిత పరికరాలు, వాక్సిన్​లు అందుబాటులో ఉంచడంలో కేంద్రం పూర్తి నిర్లక్ష్యం వహించి, ప్రజల ప్రాణాల్ని ప్రమాదంలో పడేసింది."

-రణ్​దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

"ఇది జాతీయ అత్యవసర పరిస్థితి, కానీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మునిగిపోయారు. ప్రధాని తన రాజ ధర్మాన్ని పాటించాలి, ఇది 'నువ్వు- నేను' అంటూ విమర్శించుకునే సందర్భం కాదు. కరోనాతో మనం పోరాడాల్సిన సమయం" అని అన్నారు.

ఇదీ చదవండి: 'కరోనాను జయించడానికి​ ప్రపంచం ఐక్యం కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.