వైమానిక దళ శక్తిని సరైన విధానంలో ఉపయోగించి దేశ రక్షణకు పాటుపడటమే తమ తొలి ప్రాధాన్యమని ఎయిర్ చీఫ్ మార్షల్(New IAF chief of India) వివేక్ రామ్ చౌదరి(VR Chaudhari). వైమానిక యోధుల్లో చాలా శక్తి, మరింత నేర్చుకునే సామర్థ్యం ఉందని చెప్పారు. భవిష్యుత్తులో ఎదురయ్యే యుద్ధాలకు సిద్ధం కాగలరని కొనియాడారు.
ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా నుంచి గురువారమే.. బాధ్యతలు(IAF Chief) చేపట్టారు చౌదరి. గతంలో.. వైమానిక దళంలో పలు కీలక బాధ్యతలను నిర్వర్తించారు.
" వైమానిక శక్తిని సరైన విధానంలో ఉపయోగించి దేశ భద్రతకు భరోసా కల్పించటమే మా తొలి ప్రాధాన్యత. రెండోది.. మా సిబ్బంది భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు శిక్షణతో పాటు.. మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయటం. అలాగే అన్ని విభాగాల్లో స్వావలంబన సాధించేలా ఆత్మనిర్భరత దిశగా భారీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది."
- ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, వైమానిక దళ ఛీఫ్
'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో(make in india initiative) భాగంగా దేశీయ సంస్థలతో 83 తేలికపాటి యుద్ధ విమానాలు(ఎల్సీఏ), అధునాతన మీడియం రేంజ్ యుద్ధ విమానాలు(ఏఎంసీఏ), ఎల్సీఏ-ఎంకే2 ఫైటర్ జెట్స్ కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు చౌదరి. అలాగే.. ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించగల ఆయుధాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయుధాలు, ఇతర సామగ్రి కొనుగోలులో ఆత్మనిర్భరతపైనే ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
ఇదీ చూడండి: New IAF chief of India: వైమానిక దళాధిపతిగా వీఆర్ చౌదరి