ETV Bharat / bharat

భారత్​కు చేరిన అమెరికా వైద్య పరికరాలు - రొమానియా వైద్య పరికరాలు

కరోనా కట్టడిలో భాగంగా పలు దేశాలు పంపించిన వైద్య పరికరాలు భారత్​కు చేరుతున్నాయి. అమెరికా నుంచి ఔషధాలు, ఆక్సిజన్ ఉత్పత్తి ఉపకరణాలు, మెడికల్ పరికరాలతో బయలుదేరిన తొలి విమానం శుక్రవారం ఉదయం దిల్లీకి చేరుకుంది. రొమేనియా, ఐర్లాండ్, జపాన్ దేశాలు భారత్​కు వైద్య పరికరాలను పంపాయి.

US plane
అమెరికా విమానాలు, భారత్​లో అమెరికా విమానం
author img

By

Published : Apr 30, 2021, 10:49 AM IST

Updated : Apr 30, 2021, 12:14 PM IST

కరోనాతో సతమతం అవుతున్న భారత్‌కు.. అమెరికా నుంచి ఔషధాలు, ఆక్సిజన్ ఉత్పత్తి ఉపకరణాలు, మెడికల్ పరికరాలతో తొలి విమానం దిల్లీకి చేరుకుంది. మొత్తం 100 మిలియన్ డాలర్ల మేర సాయం చేస్తామన్న అమెరికా.. అత్యవసరంగా భారత్‌కు తొలి విడతగా 17 వందల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 11 వందల ఆక్సిజన్ సిలిండర్లు 20 మంది రోగులకు నిరంతరాయంగా ప్రాణవాయువు సరఫరా చేసే ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు పంపింది.

US flight
భారత్​కు చేరిన అమెరికా విమానం

రోగులకు, ఆరోగ్య సిబ్బందికి రక్షణగా ఎన్​95 మాస్కులు, ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్టు కిట్‌లతో పాటు కాలిఫోర్నియా రాష్ట్రం ఇచ్చిన 440 ఆక్సిజన్ సిలిండర్లు కూడా భారత్‌కు వచ్చిన విమానంలో ఉన్నాయి. గురువారం.. ప్రపంచంలోని అతిపెద్ద వైమానిక దళ విమానాశ్రయం అయిన.. ట్రవిస్ ఎయిర్‌ ఫోర్స్ బేస్‌ నుంచి తొలి విమానం భారత్‌కు బయలుదేరగా ఈ ఉదయం భారత్‌కు చేరుకుంది. మరో వారం రోజుల పాటు సాయానికి సంబంధించి విమానాలు భారత్‌కు రానున్నట్లు శ్వేతసౌధం తెలిపింది.

US flight
దిల్లీలో అమెరికా విమానం

యూరోపియన్​ యూనియన్..

బ్రిటన్​, ఐర్లాండ్ దేశాల నుంచి వైద్య పరికరాలు భారత్​కు చేరుకున్నాయి. 700 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 365 వెంటిలేటర్లు ఐర్లాండ్​ పంపగా.. యూకే నుంచి ఇవాళ కూడా దేశానికి మరికొన్ని పరికరాలు వచ్చాయి. ప్రస్తుతం శుక్రవారం 280 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు యూకే నుంచి భారత్​కు చేరాయి.

ireland
ఐర్లాండ్ చేయూత
ireland
ఐర్లాండ్ పంపిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు

రొమేనియా పంపిన 80 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు, 75 ఆక్సిజన్ సిలిండర్లు శుక్రవారం ఉదయం భారత్​కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.

romania
భారత్​కు అండగా రొమేనియా

హాంకాంగ్ చేయూత..

300 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు ఇండిగో విమానంలో పంపింది హాంకాంగ్​. నేడు ఉదయం ఇవి స్వదేశానికి చేరుకున్నట్లు విమానయాన శాఖ మంత్రి హర్దీప్​ సింగ్ పురి స్పష్టం చేశారు.

hongkong
హాంకాంగ్ సాయం
bangkok
బ్యాంకాక్ పంపిస్తున్న పరికరాలు

బంగ్లాదేశ్​ సహకారం..

వచ్చే వారం రోజుల్లో రెమ్‌డెసివర్ వయల్స్ పంపనున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. ఈ మేరకు అక్కడి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మసూద్ బిన్ మొమెన్ తెలిపారు. భారత విజ్ఞప్తి మేరకు పంపుతున్నట్లు మొమెన్ పేర్కొన్నారు. భారత్‌కు సాయపడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ బుధవారం ప్రకటన జారీ చేసిన బంగ్లాదేశ్‌ 10 వేల యాంటీవైరల్ ఇంజెక్షన్లు, ఓరల్ యాంటీ వైరల్స్‌, వేలాదిగా జింక్‌, కాల్షియం, విటమిన్‌-సీ టాబ్లెట్లను కూడా పంపుతున్నట్లు తెలిపింది. దేశంలో కరోనా ప్రబలిన వేళ.. ఏప్రిల్ 25 నుంచి భారత్- బంగ్లా సరిహద్దులు మూసేస్తూ ఢాకా నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి:మాజీ అటార్నీ జనరల్ సోలీ సోరాబ్జీ కన్నుమూత

Last Updated : Apr 30, 2021, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.