కరోనా టీకాను నిల్వచేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు దిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మొట్టమొదటి శీతల గిడ్డంగిని ఏర్పాటు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.
ఇవే ప్రత్యేకతలు
కోల్డ్ స్టోరేజ్‌లో 120 వాట్స్ సామర్థ్యం కలిగిన 90 డీప్ ఫ్రీజర్లను నెలకొల్పే విధంగా బిల్డింగ్‌ను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో మూడు ఫ్లోర్లు, ఏడు గదులు ఉంటాయని, దీంట్లో రెండు గదులు కోల్డ్ చెయిన్‌కు, మరో మూడు గదులు డీప్ ఫ్రీజర్లకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఇంకో గదిని అధికారులు, సిబ్బంది కోసం వినియోగించనున్నట్లు వెల్లడించారు. మొదటి అంతస్థులో 25లక్షల సూదులు, రెండవ అంతస్తులో 75 లక్షల సూదులు నిల్వ చేసేలా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. డిసెంబర్ 25 వరుకు పూర్తి పరికరాలతో కోల్డ్ స్టోరేజ్‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
ఇదీ చదవండి : 'కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రాణాంతకం కాదు.. భయమొద్దు'