ఛత్తీస్‌గఢ్ బీజాపుర్‌లోని సిల్గేర్ గ్రామంలో పోలీసులు, స్థానికుల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు.
గ్రామంలో పోలీసులు క్యాంప్ ఏర్పాటు చేయగా దీనిని వ్యతిరేకించిన స్థానికులు.. రెండు రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఘర్షణ తీవ్రమైంది. కాల్పులకు దారితీసింది.
చనిపోయింది నక్సల్సే..
క్యాంప్‌తో తమకు ప్రమాదమని తెలిసి.. నక్సలైట్లే గ్రామస్థుల సాయంతో నిరసనలకు దిగారని తెలిపారు బస్తర్ ఐజీ. నక్సలైట్లు దాడికి తెగబడగా.. తాము జరిపిన ఎదురుకాల్పుల్లో వారిలో కొందరు చనిపోయారని పేర్కొన్నారు.
అయితే.. చనిపోయిందా నక్సలైట్లా, గ్రామస్థులా అనేది స్పష్టత లేదు.
ఇదీ చూడండి: స్టాలిన్ సూపర్ రాజకీయం.. అన్నాడీఎంకే నేతకు చోటు