Firecracker Shop Blast : బాణసంచా గోదాంలో మంటలు చెలరేగి 13 మంది మరణించిన ఘటన కర్ణాటకలో జరిగింది. బెంగళూరు-హోసూరు జాతీయ రహదారిపై ఉన్న అనేకల్ తాలుకాలోని అత్తిబెలె గ్రామంలో ఈ ప్రమాదం వెలుగుచూసింది.
ఇదీ జరిగింది..
శనివారం సాయంత్రం 7 గంటలకు అత్తిబెలె గ్రామంలో ఉన్న బాలాజీ క్రాకర్స్‌లో చిన్న మంటలు చెలరేగాయి. అనంతరం మంటలు వేగంగా వ్యాపించడం వల్ల గోదాం మొత్తం పేలిపోయింది. ప్రమాద సమయంలో గోదాంలో 20 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురు తప్పించుకున్నారు. బాణసంచా లోడ్‌ను లారీ నుంచి గోదాంలోకి దించుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే గోదాం సమీపంలో ఉన్న అనేక వాహనాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
"బాలాజీ క్రాకర్స్ గొడౌన్ వద్ద బాణసంచా లోడ్ దింపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు వెంటనే దుకాణం, గోదాం మంటల్లో చిక్కుకున్నాయి. వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. ఫోరెన్సిక్ బృందం సైతం ప్రమాద స్థలాన్ని తనిఖీ చేస్తుంది."
--మల్లిఖార్జున బాలదండి, బెంగళూరు రూరల్ ఎస్పీ
సిద్ధరామయ్య విచారం..
బాణసంచా గోదాంలో జరిగిన పేలుడు ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. "అనేకల్ సమీపంలో బాణాసంచా గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది మరణించారన్న విషయం తెలిసి చాలా బాధపడ్డాను. ఆదివారం.. ఘటనాస్థలికి వెళ్లనున్నాను. మరణించిన కార్మికుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
-
I was deeply saddened to hear the news that 12 people died in the fire that broke out in a firecracker store near Anekal in the Bangalore city district. I am going to visit the accident site tomorrow and inspect it. My condolences to the family of the deceased workers: Karnataka… https://t.co/r3NYJZPZIn
— ANI (@ANI) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">I was deeply saddened to hear the news that 12 people died in the fire that broke out in a firecracker store near Anekal in the Bangalore city district. I am going to visit the accident site tomorrow and inspect it. My condolences to the family of the deceased workers: Karnataka… https://t.co/r3NYJZPZIn
— ANI (@ANI) October 7, 2023I was deeply saddened to hear the news that 12 people died in the fire that broke out in a firecracker store near Anekal in the Bangalore city district. I am going to visit the accident site tomorrow and inspect it. My condolences to the family of the deceased workers: Karnataka… https://t.co/r3NYJZPZIn
— ANI (@ANI) October 7, 2023
రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా..
పేలుడు జరిగిన ప్రదేశాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సందర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం అందిస్తుందని ప్రకటించారు. "ఈ ఘటనకు సంబంధించి నేను సీఎం సిద్ధరామయ్యతో ఫోన్‌లో మాట్లాడాను. విషాదం గురించి తెలుసుకున్న ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తాం. గోదాంకు అనుమతి లేదని, దుకాణానికి మాత్రమే అనుమతి ఉందని అధికారులు చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తాం" అని కర్ణాటక డిప్యూటీ సీఎం చెప్పారు.
-
PHOTO | "Govt to provide Rs five lakh compensation to the families of those who died in the Anekal fireworks disaster, said Karnataka Deputy CM @DKShivakumar after visiting the site of the firework disaster in Anekal in which 13 people died on Saturday night. pic.twitter.com/tXW3e0CSA9
— Press Trust of India (@PTI_News) October 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">PHOTO | "Govt to provide Rs five lakh compensation to the families of those who died in the Anekal fireworks disaster, said Karnataka Deputy CM @DKShivakumar after visiting the site of the firework disaster in Anekal in which 13 people died on Saturday night. pic.twitter.com/tXW3e0CSA9
— Press Trust of India (@PTI_News) October 7, 2023PHOTO | "Govt to provide Rs five lakh compensation to the families of those who died in the Anekal fireworks disaster, said Karnataka Deputy CM @DKShivakumar after visiting the site of the firework disaster in Anekal in which 13 people died on Saturday night. pic.twitter.com/tXW3e0CSA9
— Press Trust of India (@PTI_News) October 7, 2023