ETV Bharat / bharat

బిర్యానీ రెస్టారెంట్​లో మంటలు.. ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ బిర్యానీ రెస్టారెంట్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, మరోవ్యక్తి కాలిన గాయాలతో హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అసలేం జరిగిందంటే..

fire-in-lucknow-best-biryani-restaurant-one-burnt-alive-another-scorched
బెస్ట్ బిర్యానీ రెస్టారెంట్​లో చెలరేగిన మంటలు
author img

By

Published : Dec 9, 2022, 11:58 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలోని ఓ బిర్యానీ రెస్టారెంట్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా కాలిపోయారు. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. అందులో ఓ వ్యక్తి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. మరో వ్యక్తి కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఎల్​పీజీ సిలిండర్ లీక్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు.

"చార్‌బాగ్‌లోని కబీర్ హోటల్ బేస్‌మెంట్‌లో బెస్ట్ బిర్యానీ అనే రెస్టారెంట్ ఉంది. ఈ హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. దీంతో అక్కడ ఉన్నవారు హడావుడిగా మంటలను అదుపు చేయడం ప్రారంభించారు. దీంతో పాటు వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కొద్దిసేపటికే మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రకాష్ సుధాకర్ అనే వ్యక్తి మరణించినట్లు వైద్యులు తెలిపారు. మంటల్లో 40 శాతం కాలిపోయిన మరో వ్యక్తి అనీస్ షేక్ అలియాస్ బాద్షా చికిత్స పొందుతున్నారు. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ లీక్‌ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కబీర్ హోటల్‌లోని ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నందున మంటలు సకాలంలో అదుపులోకి వచ్చాయి" అని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

'కొలీజియం ఈ దేశ చట్టం.. దీనికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు వద్దు'

గుజరాత్​, హిమాచల్​ప్రదేశ్​ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్​ లెక్క ఎంత వరకు కరెక్ట్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.