మధ్యప్రదేశ్ శాజాపుర్ జిల్లా కరేడి రోడ్ బైపాస్‌పై మంటలు అంటుకొని ఓ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇంజిన్‌లో మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.
ఇందోర్ నుంచి లఖ్‌నవూకు వెళుతున్న క్రమంలో రాత్రి 9 గంటలకు కరేడి రోడ్ శాజాపుర్ బైపాస్కు చేరుకుంది బస్సు. ఈ క్రమంలో బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపేసి ప్రయాణికులను దింపేశాడు. ఆ వెంటనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని.. కానీ, కొందరి లగేజీ బస్సులోనే దగ్ధమైనట్లు ప్రయాణికులు చెప్పారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
ఇదీ చూడండి: జూదం తీసిన ప్రాణం - మరో యువకుడు బలి