Fire Broke Out in Train: మహారాష్ట్ర నందుర్బార్ జిల్లాలో.. ఓ రైలులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా రైల్వే స్టేషన్కు రాగానే గాంధీధామ్- పూరీ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ఉదయం 10.45 నిమిషాలకు రైలు బోగీల్లో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు బయటకు పరుగులు పెట్టారు.

రైలులో ఆహారం తయారు చేసే(pantry car) బోగీలో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. రైలు మిగిలిన బోగీలను మంటలు అంటుకున్న బోగీ నుంచి వేరుచేసినట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: గుడిసెలో ఒంటరిగా ఉన్న మహిళపై సామూహిక అత్యాచారం