హరియాణా సోనిపత్ జిల్లాలో రైతుల ఆందోళన చేస్తున్న ప్రదేశంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుండ్లీ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో అన్నదాతలు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న టెంట్లు పూర్తిగా కాలిపోయాయి. ఎలాంటి ప్రాణానష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
సోనిపత్ జీటీ రోడ్లోని రసోయి ధాబా ముందు ఈ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
అయితే రైతుల ఉద్యమాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని.. అగ్ని ప్రమాదం కూడా ప్రభుత్వ కుట్రేనని రైతునేత జంగ్వీర్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. రైతులు ఐక్యంగా ఉన్నారని.. వారిని విడదీయలేరన్నారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు నిరసన చేపట్టి.. ఈ నెల 25 నాటికి ఏడాది పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో రైతులు నిరసనలను ఉద్ధృతం చేశారు.
ఇదీ చూడండి: విషాదం.. టపాసులు పేలి తండ్రీకొడుకులు మృతి