ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ రైల్వే స్టేషన్ వద్ద నిలిపి ఉన్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. దిల్లీ నుంచి లఖ్‌నవూ వెళ్తున్న ఈ రైలులో జనరేటర్ కార్ నుంచి మంటలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. శనివారం ఉదయం 6.45కి జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
మంటలు చెలరేగిన బోగీని రైలు నుంచి వేరు చేయడం వల్ల ప్రయాణికులకు ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు 8.20 గంటలకు లఖ్‌నవూ బయలుదేరినట్లు చెప్పారు.
అయితే.. ఘటనకు గల కారణాల ఇంకా తెలియరాలేదని, షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి : రిజర్వేషన్లు ఇంకెన్ని తరాలు?: సుప్రీం