ETV Bharat / bharat

మాస్క్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం- ఒకరు మృతి - దిల్లీ అగ్ని ప్రమాదం

పశ్చిమ దిల్లీ మాయాపురి ప్రాంతంలోని మాస్క్​ తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగి ఓ వ్యక్తి మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Fire accident in delhi
మాస్క్​ తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
author img

By

Published : Dec 26, 2020, 9:37 AM IST

దేశ రాజధాని దిల్లీలోని మాయాపురి ప్రాంతంలోని ఓ మాస్క్​ తయారీ పరిశ్రమలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

తెల్లవారుజామున 3.50 గంటలకు తమకు సమాచారం అందినట్లు తెలిపారు అగ్నిమాపక సిబ్బంది. వెంటనే 6 అగ్నిమాపక వాహనాలతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు చెప్పారు.

" పరిశ్రమలోని మూడో అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. తలుపులు బద్దలుకొట్టి ముగ్గురిని రక్షించారు అగ్నిమాపక సిబ్బంది. అందులో ఒకరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతన్ని దీన్​దయాల్​ ఉపాధ్యాయ​ ఆసుపత్రికి తరలించాం. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతుడు జగుల్​ కిశోర్​​గా తెలిసింది. "

- అతుల్​ గార్గ్​, దిల్లీ అగ్నిమాపక విభాగం డైరెక్టర్​

ప్రాణాలతో బయటపడిన మరో ఇద్దరు అమన్​ అన్సారీ (18), ఫిరోజ్​ అన్సారీ (24)గా తెలిపారు అధికారులు.

ఇదీ చూడండి: గోడ కూలి ఇద్దరు జవాన్లు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.