ETV Bharat / bharat

జాలర్ల కిడ్నాప్​కు పాక్‌ యత్నం.. ఆపై కాపాడామంటూ కట్టుకథ.. కేసు నమోదు - భారత నేవీ లేటెస్ట్ న్యూస్

భారత మత్స్యకారులపై దాడి చేసి, కిడ్నాప్‌ చేసేందుకు యత్నించిన పాక్‌ నేవీ అధికారులపై కేసులు నమోదయ్యాయి. వారిని కాపాడామని పాక్‌ అధికారులు మొదట నమ్మించారని, కానీ మత్స్యకారులు అసలు విషయాన్ని వెల్లడించారని భారత కోస్ట్‌గార్డ్‌ అధికారులు తెలిపారు.

india navy fir on pakistani navy
india navy fir on pakistani navy
author img

By

Published : Oct 9, 2022, 8:10 PM IST

అరేబీయా సముద్ర తీరంలో భారత మత్సకారులను అపహరించేందుకు యత్నించిన ఘటనలో పాక్ నేవీ అధికారులపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 6న ఏడుగురు మత్స్యకారులు జఖౌ సముద్ర తీరంలోని భారత జలాల్లో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌ మెరైన్ సెక్యూరిటీ ఏజెన్సీకి (పీఎంఎస్​ఏ) చెందిన బోటులో 20 నుంచి 25 మంది పాక్ జవాన్లు.. భారత పడవపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పడవ ధ్వంసమై మునిగిపోయింది. అనంతరం మత్య్సకారులను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.

ఈ సమాచారం అందుకున్న భారత నేవీ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. భారత సిబ్బందిని చూసిన పాక్ నేవీ బృందం అప్పటికప్పుడు ఓ కట్టుకథ అల్లింది. మునిగిపోతున్న భారత పడవను కాపాడి మత్య్సకారులకు సపర్యలు చేసినట్లు ఓ వీడియో చేయించింది. అది భారత నేవీ బృందానికి చూపింది. అయితే ఘటన తరువాత ఇళ్లకు చేరుకున్న మత్య్సకారులు అసలు విషయాన్నిబయటపెట్టారు. పాక్ నేవీ బృందం.. తమను భయాందోళనకు గురి చేసిందని అన్నారు. అంతేకాకుండా తమను బెదిరించి అబద్ధం చెప్పించిందని తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పాక్‌ నేవీ అధికారులపై చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధమైంది.

ఇవీ చదవండి: లైవ్ వీడియో.. వరదలో బస్సు బోల్తా.. లక్కీగా 50 మంది...

108 ఏళ్ల వృద్ధురాలిపై దారుణం.. బాత్​రూమ్​కు తీసుకెళ్లి.. కాళ్లు నరికి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.