ETV Bharat / bharat

సువేందు అధికారిపై దొంగతనం కేసు - బంగాల్‌ ప్రతిపక్షనేత సువేందు అధికారిపై కేసు

బంగాల్‌ ప్రతిపక్షనేత సువేందు అధికారిపై కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ కార్యాలయం నుంచి లక్షలు విలువ చేసే సామగ్రిని దొంగతనం చేశారన్న ఆరోపణల మధ్య బంగాల్​ పోలీసులు కేసు నమోదు చేశారు.

FIR filed against BJP leader Suvendu Adhikari
బంగాల్‌ ప్రతిపక్షనేత సువేందు అధికారిపై కేసు నమోదు
author img

By

Published : Jun 6, 2021, 12:32 AM IST

Updated : Jun 6, 2021, 6:39 AM IST

బంగాల్‌ ప్రతిపక్షనేత సువేందు అధికారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కంతి మున్సిపాలిటీ కార్యాలయం నుంచి సామగ్రి దొంగతనం చేశారన్న ఆరోపణల మధ్య సువేందు అధికారి, అతని సోదరుడు కాంతిపైనా కేసు నమోదైంది.

కంతి మున్సిపల్ బోర్డు సభ్యుడు రత్నదీప్ మన్నా.. సువేందు అధికారి, ఆయన సోదరుడిపై కంతి పోలీస్ స్టేషన్​లో జూన్​ 1 న ఫిర్యాదు చేశారు.

" మే 29న సువేందు అధికారి, కాంతి, మాజీ కంతి మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు అధికారి.. కార్యాలయ గిడ్డంగిలో బలవంతంగా, అక్రమంగా చొరబడి లక్షలు విలువచేసే సామాగ్రిని దోచుకెళ్లారు."

-- రత్నదీప్ మన్నా ఇచ్చిన ఫిర్యాదులో

ఈ దోపిడీలో కేంద్ర సాయుధ బలగాలను సైతం వినియోగించినట్లు ఫిర్యాదులో ఉంది.

ఇదీ చదవండి : పిడుగుపాటుతో నలుగురు మృతి

Last Updated : Jun 6, 2021, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.