Film maker molesting a girl: సినీ ఇండస్ట్రీలో పనిచేసే ఛాన్స్ ఇప్పిస్తానని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ దారుణానికి పాల్పడ్డాడు. ఓ బాలికను లైంగికంగా వేధించాడు. సినిమా ఛాన్స్ ఆశ చూపించి.. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ కేసును విచారిస్తున్న ముంబయి పోలీసులు.. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 354ఏ, పోక్సో చట్టం ప్రకారం దర్యాప్తు జరుపుతున్నారు.
బాలికపై అత్యాచారం..
Odisha Girl raped: మరోవైపు, ఒడిశా భువనేశ్వర్ శివారులో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. కూలీ పని చేసుకునే బాలిక దగ్గరి బంధువే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బాలికను రేప్ చేశాడని వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
బాధితురాలిని తొలుత బాలిపట్న ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్‌లోని క్యాపిటల్ ఆస్పత్రికి పంపినట్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
మహిళపై సహోద్యోగి...
మరోవైపు, త్రివేండ్రం విమానాశ్రయంలో పనిచేసే ఉన్నతాధికారి.. తోటి మహిళా ఉద్యోగిని తన ఫ్లాట్‌లో లైంగికంగా వేధించాడని పోలీసులు కేసు నమోదు చేశారు.
kerala airport official sexual assault
నెల రోజుల క్రితం ఉద్యోగంలో చేరిన తనను.. మధుసూదన రావు అనే వ్యక్తి జనవరి 4న తన ఫ్లాట్‌కు ఆహ్వానించాడని బాధితురాలు పేర్కొన్నారు. అక్కడే తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన ఆయన సైతం నెల క్రితమే.. త్రివేండ్రం విమానాశ్రయం ఆపరేటింగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.
ఆరోపణల నేపథ్యంలో మధుసూదన రావును విధులలో నుంచి తొలగించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. తదుపరి విచారణ జరుపుతున్నామని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత మహిళ స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: యాక్టర్ సచిన్ జోషికి షాక్- ఆ కేసులో రూ. 410 కోట్ల ఆస్తుల జప్తు!