ETV Bharat / bharat

మహిళలను రాత్రుళ్లు పనిచేయమని ఒత్తిడి చేస్తున్నారా?.. ఇక కష్టమే! - మహిళా ఉద్యోగుల వేళలు

Female Workers No Night Shifts: మహిళా ఉద్యోగులకు నైట్​ షిప్ట్​లు వేయవద్దని ఆదేశించింది ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం. ఒకవేళ వారు తమ ఇష్టంతో డ్యూటీ చేయాలనుకుంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగానీ, నైట్​ షిఫ్ట్​ విషయంలో బలవంతం చెయ్యొద్దని తెలిపింది.

Female workers
Female workers
author img

By

Published : May 29, 2022, 6:54 AM IST

Female Workers No Night Shifts: ఉత్తర్​ప్రదేశ్​లో యోగి ఆదిత్యనాథ్​ సర్కారు రెండో సారి అధికారంలో వచ్చాక కీలక సంస్కరణలు చేపడుతోంది. తాజాగా మహిళా ఉద్యోగులు డ్యూటీ వేళల పట్ల కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి వేళ కార్యాలయాల్లో పనిచేయవద్దని ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ ఆఫీసులతో పాటు ప్రైవేటు కార్యాలయాలకు కూడా అమలు అవుతాయని తెలిపింది. మహిళలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, వారు తమ కుటుంబానికి తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఒకవేళ సాయంత్రం 7 నుంచి ఉదయం 6 గంటల వరకు పని చేసే మహిళా ఉద్యోగులకు ఆఫీసు యాజమాన్యం ఉచిత రవాణా సౌకర్యంతో పాటు భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆఫీసుల్లో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, త్రాగునీటి సౌకర్యాలతో పాటు పని చేసే ప్రదేశంలో లైట్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయమని తెలిపింది. వాటితో పాటు నైట్​ షిప్ట్​ చేసే మహిళా ఉద్యోగుల జాబితా.. స్థానిక పరిశ్రమల ఇన్​స్పెక్టర్​కు అందించమని చెప్పింది.

ఉత్తరప్రదేశ్ కార్మికశాఖ జారీ చేసిన ఆదేశాలపై సమాచార ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహగల్ స్పందించారు. "ఈ ఉత్తర్వులను లేబర్ డిపార్ట్‌మెంట్ జారీ చేసింది. ఇక నుంచి మహిళా ఉద్యోగులకు రాత్రిపూట డ్యూటీ చేయమని బలవంతం చేయడానికి వీలు లేదు.. అవసరమైన సేవలు మినహా అన్ని విభాగాలతో పాటు ప్రైవేట్ సంస్థలలో ఈ నిబంధనలు వర్తిస్తాయి" అని చెప్పారు.

ఇవీ చదవండి: అత్తింటి వేధింపులు.. బావిలో దూకిన అక్కాచెల్లెళ్లు.. ఇద్దరు చిన్నారులతో సహా..

'ఆప్​' సర్కార్​ మరో కీలక నిర్ణయం.. 424 మంది వీఐపీలకు భద్రత కట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.