ETV Bharat / bharat

'ఎల్​జేపీ' వివాదంపై 'ఆర్​జేడీ' స్పందించదేం? - చిరాగ్ పాశ్వాన్ వార్తలు

వారం రోజులుగా బిహార్​లో 'ఎల్​జేపీ వివాదం' కొనసాగుతోంది. దీనిపై దాదాపు అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. కానీ ఆర్​జేడీ మాత్రం ఈ విషయంలో మౌనాన్నే ఆశ్రయిస్తోంది. ఎందుకు ఈ విషయంపై ఆ పార్టీ మాట్లాడటం లేదు? తేజస్వీకి మరో యువనేత పోటీకి రాకూడదనే నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోందా?

rjd silence on chirag ljp issue
చిరాగ్ వివాదంపై ఆర్జేడీ మౌనం
author img

By

Published : Jun 19, 2021, 12:11 PM IST

లోక్​ జనశక్తి పార్టీపై చిరాగ్ పాసవాన్(Chirag Paswan) పట్టుకోల్పోవడం... ఎంపీలు తమ పార్లమెంటరీ పక్షనేతను మార్చుకోవాలని తీర్మానించడం.. పార్టీ అధ్యక్ష పదవిని సైతం చిరాగ్​కు దూరం చేయడం వంటి పరిణామాలతో బిహార్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎల్​జేపీలో అంతర్గత కుమ్ములాటలకు సీఎం నితీశ్ కుమారే కారణమంటూ వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలో భగ్గుమన్నాయి. అయితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్(RJD) పార్టీ ఈ వివాదం మొదలైనప్పటి నుంచి.. ఒక్క మాటా మాట్లాడలేదు. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఎల్​జేపీ ప్రతిష్టంభనపై నోరుమెదపలేదు. ఇవే కాదు! గతంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జేఎన్​యూ కన్నయ్య కుమార్ వివాదం, జన్ అధికార్ పార్టీ పప్పూ యాదవ్ ఘటనపైనా.. మౌనాన్నే ఆశ్రయించింది ఆర్​జేడీ.

ఎందుకు?

నిజానికి తేజస్వీ(Tejashwi Yadav)తో పాటు ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గానే ఉంటారు. దాదాపు వారం నుంచి.. ఈ వివాదం నడుస్తున్నప్పటికీ వీరిద్దరి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే, ఆర్​జేడీ మౌనం వెనక కారణాలు లేకపోలేదు. ఈ వివాదాలపై స్పందించి యువనేతలకు మరింత ప్రాచుర్యం కల్పించడం ఇష్టంలేకే ఆ పార్టీ నేతలు మిన్నకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తేజస్వీ యాదవ్ మినహా ఇతర యువకులు రాజకీయంగా ఎదగకూడదని ఆర్​జేడీ నేతలు భావిస్తున్నారని అంటున్నారు.

ఆర్​జేడీతో పాటు మహాగట్​బంధన్​కు కూడా తేజస్వీ యాదవే ముఖచిత్రంగా ఉన్నారు. లాలూ ప్రసాద్ జైల్లో ఉన్నప్పుడు తేజస్వీ.. పార్టీని సమర్థవంతంగా నడిపించారు. కాబట్టి తేజస్వీ ఇమేజ్​ విషయంలో ఆర్​జేడీ నేతలు రాజీ పడటం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

"ఎవరైనా యువ రాజకీయ నేత తమ గుర్తింపు కోసం పాటుపడుతుంటే లేదా.. బాగా ప్రాచుర్యంలోకి వస్తే ఆర్​జేడీ సైలెంట్​ మోడ్​లోకి వెళ్లిపోతుంది. వారిపై ఏదైనా మాట్లాడితే అది తిరగబడి పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్​జేడీ భయపడుతుంది. కన్నయ్య కుమార్ విషయంలోనూ ఇదే జరిగింది. విపక్షంలో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా కన్నయతో తేజస్వీ స్టేజీ పంచుకోలేదు. యువకులు కీలకంగా ఉన్న పార్టీలతో ఆర్​జేడీ ఎప్పుడూ అనుబంధం పెంచుకోదు. ప్రజాస్వామ్య విధానంలో ఇలాంటివి ప్రశంసించదగినవి కాదు. దురదృష్టవశాత్తు ఆర్​జేడీ అధినాయకత్వం మౌనంగానే ఉంటోంది."

-డాక్టర్ సంజయ్ కుమార్, పట్నాలోని రాజకీయ విశ్లేషకులు

మరోవైపు, తేజస్వీ యాదవ్​తో పాటు చిరాగ్ పాసవాన్​కు సైతం బిహార్ ముఖ్యమంత్రి(Bihar CM) కావాలన్న ఆశయం ఉందని సంజయ్ వివరించారు. కాబట్టి తోటి యువనేతగా ఆయనకు అనుకూలంగా మాట్లాడటానికి తేజస్వీ వెనకాడుతున్నారని చెప్పారు. 'తేజస్వీ చుట్టు యువనేతలు ఉండటాన్ని కూడా ఆర్​జేడీ తట్టుకోలేదు. చిరాగ్​కు జనంలో ఆదరణ బాగానే ఉంది. చిరాగ్.. జనంలో మరింత పట్టు సాధిస్తే తేజస్వీకి ఇబ్బందులు తప్పవు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని లాలూ, తేజస్వీ మౌనంగా ఉంటున్నారు' అని సంజయ్ వివరించారు.

అలాంటిదేం లేదు: ఆర్​జేడీ

అయితే ఆర్​జేడీ నేతలు ఈ వాదనను ఖండిస్తున్నారు. ఎల్​జేపీ వివాదంపై ప్రకటన చేయడం వెనక నాయకత్వ సంబంధిత సమస్యలేం లేవని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో పరిస్థితులపై చిరాగ్ పాసవాన్​కే స్పష్టత లేదని, అలాంటప్పుడు ఆయనకు ఎలా మద్దతిస్తామని అంటున్నారు.

"ఎవరైనా వచ్చి నాయకులు అయిపోయేందుకు ఇది(ఆర్​జేడీ) జంపింగ్ ప్యాడ్ కాదు. ఎల్​జేపీ వేరే పార్టీ, అది వేరే భావజాలంతో పనిచేస్తుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలనే తీసుకుంటే... ఆ పార్టీకి ఎన్​డీఏలో చోటు దక్కలేదు. ఆ సమయంలోనే మా దగ్గరికి రావాల్సింది. కానీ అలా చేయలేదు. భాజపాను ఇష్టపడుతూ నితీశ్​ను ద్వేషిస్తున్నారు. ఇదేం రాజకీయం? ఆయన భావజాలం స్పష్టంగా లేదు. ఎటువైపు వెళ్లాలో తెలియదు. ఆయనే గందరగోళంలో ఉన్నప్పుడు ఆర్​జేడీ ఎందుకు ప్రకటన చేయాలి? అది ఎల్​జేపీ అంతర్గత విషయం. అనవసరంగా నాయకత్వ సమస్యలను ఆర్​జేడీ చుట్టు అల్లుతున్నారు."

-సుధాకర్ సింగ్, రామ్​గఢ్​ ఆర్​జేడీ ఎమ్మెల్యే

ఎన్నికల సమయంలో తేజస్వీ యాదవ్ చిరాగ్​ను కూటమిలోకి ఆహ్వానించిన విషయాన్నీ సుధాకర్ గుర్తు చేశారు. దీనికి చిరాగ్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పారు. ఆర్​జేడీ నాయకత్వం విషయంలో ఎలాంటి ఆందోళనా లేదని స్పష్టం చేశారు. అయితే, ఒకవేళ చిరాగ్ తమతో కలవాలని అనుకుంటే అందుకు సమ్మతమేనని చెప్పారు. చిరాగ్.. రాంవిలాస్ పాసవాన్​ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారని అన్నారు. రాంవిలాస్​ విషయంలో తమకు గౌరవం ఉందని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.