ETV Bharat / bharat

టీకా వద్దంటూ పొదల్లో దాక్కున్న వృద్ధురాలు - రాజస్థాన్

కరోనాపై ఏకైక ఆయుధంగా ఉన్న టీకా ప్రక్రియను ఓవైపు ప్రభుత్వం వేగవంతం చేస్తోన్న వేళ.. మరోవైపు దానిపై వస్తోన్న వదంతులతో ఇప్పటికీ పలువురు భయభ్రాంతులకు గురవుతున్నారు. టీకా వేసుకుంటే ప్రాణహాని అని భయపడుతూ ఓ వృద్ధురాలు పొదల్లో దాక్కున్న ఘటన రాజస్థాన్​లో వెలుగులోకి వచ్చింది.

Fear of corona vaccination
టీకాకు భయపడిన వృద్ధురాలు
author img

By

Published : May 27, 2021, 5:51 PM IST

కరోనా టీకాకు భయపడి పొదల్లో దాక్కున్న వృద్ధురాలు

కరోనాకు టీకాయే సంజీవనిగా ఉన్న వేళ కొన్ని గ్రామాల్లో దానిపై వదంతులు వ్యాపిస్తున్నాయి. వీటితో పలువురు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే టీకా వేసుకుంటే చనిపోతాననే భయంతో పొదల్లో దాక్కున్నారు ఓ వృద్ధురాలు. ఈ ఘటన రాజస్థాన్​లోని చిత్తోడ్​గఢ్​లో జరిగింది.

ఏం జరిగిందంటే..

కిరత్​పురా​ సమీపంలోని ఓ అడవిలో ఒక వృద్ధురాలి శవం ఉందని పక్కనే పొలాల్లో పనిచేసే వ్యక్తి తమ గ్రామస్థులకు బుధవారం సమాచారం అందించారు. దీంతో సర్పంచ్ ప్రతినిధి నీతిరాజ్​ సింగ్​ సహా స్థానికులు అక్కడికి చేరుకున్నారు. చూసేసరికి ఆమె ప్రాణాలతోనే ఉన్నారు.

వృద్ధురాలిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోండగా.. తనకు టీకా వేయొద్దంటూ చేతులు జోడించి పదేపదే వేడుకున్నారు. వ్యాక్సిన్​ తీసుకుంటే తాను చనిపోతానని వారితో చెప్పారు. కాగా, అతి కష్టం మీద ఆమెను బయటకు తీసుకురాగలిగారు.

వదంతుల వల్లే..

కొందరు కావాలనే వ్యాక్సిన్​పై దష్ప్రచారం చేస్తున్నారని నీతిరాజ్​ అన్నారు. అందుకే ప్రజలు టీకా తీసుకునేందుకు ఆసక్తిగా లేరని చెప్పారు. వదంతులు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చూడండి: COVID vaccine: త్వరలో అందుబాటులోకి మరో టీకా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.