వారిద్దరూ కవలలు. ఇద్దరూ కలిసే పెరిగారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఇక పెళ్లి సమయం వచ్చింది. వారిద్దరికీ పెళ్లిచేసి చెరో ఇంటికి సాగనంపాలని పెద్దలు నిశ్చయించారు. అయితే.. 'పెళ్లైతే మేము విడిపోతాం.. కలిసి ఉండలేం' అని భయపడ్డ ఆ కవలలు బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఏం జరిగిందంటే..
కర్ణాటక మండ్య జిల్లా శ్రీరంగపట్నం మండలం, హనసనహళ్లి గ్రామానికి చెందిన దీపిక, దివ్య(19) కవలలు. అయితే వారికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. అదే జరిగితే తమ బంధం తెగిపోతుందని భావించిన కవలలు శనివారం సాయంత్రం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటనపై అరికేర్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి : Viral Video: వేదికపైనే వరుడిని చెప్పుతో కొట్టిన తల్లి