ETV Bharat / bharat

కూతుర్ని చంపి.. తలతో ఠాణాకు! - ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం

ఉత్తర్​ప్రదేశ్​లోని హర్దోయ్​ జిల్లాలో దారుణం జరిగింది. కుమార్తెను హతమార్చి తలను తీసుకుని నిందితుడు పోలీస్​స్టేషన్​కు వెళ్లడం తీవ్ర కలకలం రేపింది.

uttarpradesh, honour killing
కుమార్తెను చంపి.. తలతో ఠాణాకు..
author img

By

Published : Mar 3, 2021, 11:03 PM IST

Updated : Mar 4, 2021, 7:05 AM IST

గ్రామస్థులంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో తన ఇంటి నుంచి సర్వేశ్​ కుమార్​ బయటకు వచ్చాడు. పోలీస్​ స్టేషన్​ వైపు అడుగులు వేస్తున్న అతడిని చూసి గ్రామం అంతా ఉలిక్కి పడింది. అతని రాక్షసత్వాన్ని చూసి ఎవరికీ నోట మాట రాలేదు. పరువు కోసం కన్న కూతురినే హత్య చేసి ఆమె తలతో వీధిలోకి వచ్చాడు నిందితుడు. ఈ అమానుష ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని హర్దోయ్​ జిల్లా పాండేయ తార గ్రామంలో బుధవారం జరిగింది.

up murder
నిందితుడు సర్వేశ్​ కుమార్​
up murder
ఘటనాస్థలిని పరిశీలిస్తున్న పోలీసులు

ఎందుకీ దారుణం?

నిందితుడు సర్వేశ్​కుమార్​ కుమార్తె నీలమ్​ (16).. బంధువైన ఆదేశ్​ అనే యువకుడిని ప్రేమించింది. రెండు రోజుల క్రితం వీరిద్దరూ సన్నిహితంగా కలిసి తిరగడం నిందితుడి కంట పడింది. వారి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న సర్వేశ్​ కుమార్​ మృగంగా మారాడు. పరువు ముందు కుమార్తె జీవితం గురించి ఆలోచించలేదు. ప్రేమికులను కడ తేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఎవరూ లేని సమయం కోసం ఎదురు చూశాడు. బుధవారం నాడు ఇంట్లో ఒంటరిగా ఉన్న నీలమ్​ తలనరికి చంపాడు. ఆ తర్వాత ఆమె శిరస్సును మొండెం నుంచి వేరు చేసి.. ఆ తలతో పోలీస్​ స్టేషన్​ బాట పట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దారిలోనే నిందితుడిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చదవండి : 'టీకా ధ్రువపత్రంపై మోదీ చిత్రం అధికార దుర్వినియోగమే'

Last Updated : Mar 4, 2021, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.