Father Killed New Born Baby : మూడో సంతానంలో కూడా ఆడపిల్ల జన్మించిదని ఆగ్రహానికి గురైన ఓ తండ్రి కసాయిగా మారాడు. ఆసుపత్రి ఆవరణలోనే శిశువును నేలకేసి కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణమైన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం పీలీభీత్ జిల్లాలో జరిగింది.
ఇగీ జరిగింది..
Father Killed New Born Baby : శబ్బొ, ఫర్హాన్ అనే దంపతులకు ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పురాన్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధి సిర్సా గ్రామంలో ఈ దంపతులు నివసిస్తున్నారు. కాగా ఐదు రోజుల కిందట శబ్బొ ప్రసవ వేదనతో బాధపడుతుండగా, భర్త ఫర్హాన్ ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ క్రమంలో మే 28న శబ్బొ ముచ్చటగా మూడోసారి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. నెలలు నిండక ముందే జన్మించిన శిశువును వైద్యుల సలహా మేరకు శబ్బొ కుటుంబ సభ్యులు పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు.
![father killed new born baby](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18644754_babies.jpg)
ఫర్హాన్ పిల్లల ఆసుపత్రిలో ఉన్న శిశువును చూసేందుకు వెళ్లాడు. ఫర్హాన్‌కు ఆయన భార్య సోదరి సునయన ఆ శిశువును అతడి చేతిలో పెడుతూ మురిసిపోయింది. అంతలోనే ఆ కిరాతకుడు శిశువును నేలపై విసిరేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారిని లఖ్‌నవూలోని ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఆ చిన్నారి మార్గ మధ్యలో ప్రాణాలు విడిచింది . దీంతో తల్లి శబ్బొ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఫర్హాన్‌పై తగిన చర్యలు తీసుకోవాలంటూ శబ్బొ తల్లి నస్రీన్ పురాన్‌పుర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
![father killed new born baby](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18644754_papa.jpg)
![father killed new born baby](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18644754_thalli.jpg)
పెళ్లి ఊరేగింపులో వరుడికి గుండెపోటు..
Groom Died On Wedding Day : పచ్చని తోరణాలతో కళకళలాడాల్సిన పెళ్లి ఇంట్లో.. వరుడి మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పీలీభీత్ జిల్లాలోని జర్వాల్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధి అత్వాల్లో జరిగింది ఈ ఘటన.
అత్వాల్‌కు చెందిన రాజ్‌కమల్(21)కు కోయిలిపూర్వాకు చెందిన యువతితో మే 29న వివాహం జరిగింది. వివాహ అనంతరం ఘనంగా ఊరేగింపు నిర్వహించేందుకు బంధుమిత్రులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకాసేట్లో ఊరేగింపు అనగా..పెళ్లి మండపంలో వరుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వరుడిని వెంటనే స్థానిక హెల్త్ సెంటర్‌కు తరలించారు. అప్పటికే గుండె పోటుతో మరణించినట్లు వైద్యుడు రాజ్‌కమల్ తెలిపారు. వరుడి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి ఊరేగింపులో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది.
![groom died on wedding day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18644754_varudu.jpg)