ETV Bharat / bharat

చికిత్స అందక ఆస్పత్రి వెలుపలే వృద్ధుడు మృతి - father dies due to lack of treatment in mp

చికిత్స కోసం ఎదురుచూస్తూ ఆస్పత్రి వెలుపలే మృతిచెందాడు ఓ రోగి. కుమారుడి ఒడిలోనే తండ్రి తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని రతలామ్​ జిల్లాలో శనివారం జరిగింది.

madhya pradesh jaora news, మధ్యప్రదేశ్​ రతలామ్​ జిల్లా వార్తలు
మధ్యప్రదేశ్​లో విషాదం
author img

By

Published : May 10, 2021, 10:32 AM IST

చికిత్స అందక మృతి చెందిన వృద్ధుడు

చికిత్స అందక ఓ వృద్ధుడు ఆసుపత్రి ఆవరణలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఒడిలోనే తుది శ్వాస విడిచిన తండ్రిని చూసి కుమారుడు బోరున విలపించాడు. తండ్రికి వైద్యులు చికిత్స అందిస్తారని ఆస్పత్రి ముందు పడిగాపులు పడిన ఆ కుమారుడు సహా అతని బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాధితుడు మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని రతలామ్​ జిల్లా జావరా ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జరిగింది.

ఇంతకీ జరిగింది ఏంటంటే..

హరియఖేడా గ్రామానికి చెందిన ఓంకార్​ లాల్​ పటీదార్​ (70) శనివారం శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కొన్నాడు. తండ్రి పరిస్థితిని గ్రహించిన అతని కుమారుడు.. బంధువులు సాయంతో కారులో జావరా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. కానీ వైద్యుల కోసం నిరీక్షించినా ఫలితం లేకపోయింది. బాధితుడు ఓంకార్​ లాల్​ను అతని కుమారుడు తన ఒడిలో పడుకోపెట్టుకుని కారులోనే కూర్చున్నాడు. గంటన్నర తర్వాత పరిస్థితి విషమించి ఓంకార్​లాల్​ తన కుమారుడి ఒడిలోనే తుది శ్వాస విడిచాడు. తండ్రి మరణంతో కుమారుడి రోదనకు అంతులేకుండా పోయింది.

నిర్లక్ష్యమే కారణం..

ఓంకార్​ లాల్ మృతిపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన అతని బంధువులు వైద్య సిబ్బందితో ఘర్షణకు దిగారు. బాధితుడి​ పరిస్థితిని వివరించి చికిత్స అందించమని వైద్య సిబ్బందికి మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని మృతుడి బంధువులు మండిపడ్డారు. వైద్యుల నిర్లక్ష్యమే ఈ విషాదానికి దారి తీసిందని ఆరోపిస్తున్నారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బంధువులకు నచ్చజెప్పి పంపించారు. మృతుడు కరోనాతో చనిపోయి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. మృతదేహానికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. బంధువులు శవాన్ని తమ గ్రామానికి తీసుకుపోయారు.

అప్పటికే విషమంగా..

ఈ ఘటనపై వైద్య అధికారులు స్పందించారు. వైద్యులు బాధితుడిని పరిశీలించారని.. అయితే రోగిని ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయానికే అతని పరిస్థితి విషమంగా ఉందన్నారు.

ఇదీ చూడండి : ఆంక్షలు బేఖాతరు- అంత్యక్రియలకు వేలమంది హాజరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.