ETV Bharat / bharat

పుట్టిన రోజునే పిల్లలపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన తండ్రి.. వైఫై పాస్​వర్డ్ కోసం బాలుడి హత్య - వైఫై పాస్​వర్డ్ కోసం మైనర్​ చంపివ ఇద్దరు వ్యక్తులు

పుట్టిన రోజు వేడుకల్లో భోజనం తక్కువగా వండారని ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు నిప్పంటించాడు. ఇంటికి వచ్చిన అతిథులు.. ఆ పసికూనలను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పిల్లల తల్లి తన భర్తపై మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరో పక్క వైఫై పాస్​వర్డ్ చెప్పలేదని 17 ఏళ్ల బాలున్ని హతమార్చారు ఇద్దరు వ్యక్తులు.

childrens
పిల్లలు
author img

By

Published : Nov 1, 2022, 11:06 PM IST

ఉత్తరప్రదేశ్​ బిజ్​నోర్ జిల్లా, గోపాల్‌పుర్ గ్రామానికి చెందిన అరుణ్​ తన పిల్లలపై క్రూరంగా ప్రవర్తించాడు. అమాయకులైన చిన్నారులపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. పుట్టినరోజునే ఈ దారుణానికి పాల్పడ్డాడు. బర్త్​డేకు వచ్చిన బంధువులు పిల్లలిద్దరిని హుటహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అసలేం జరిగిందంటే..?
అరుణ్​కు ఆరవ్​, ఊర్వశి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్టోబర్​ 30న ఆరవ్​ పుట్టిన రోజు. ఆ పుట్టిన రోజును ఘనంగా చేయాలనుకున్నారు. బంధువులందరినీ పిలిచారు. వేడుకల సమయంలో అతిథుల కోసం వండిన అన్నం కొంచెం తక్కువైంది. దాంతో మద్యం మత్తులో ఉన్న అరుణ్... భార్య బందనపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

childrens
చిన్నారులు

బందన మంటల నుంచి తప్పించుకుంది. అయితే పిల్లలు ఆరవ్, ఊర్వశి మాత్రం మంటల్లో చిక్కుకున్నారు. వెంటనే పిల్లలను ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం వందన తన భర్తపై మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పిల్లలిద్దరికీ దాదాపు 30 శాతం కాలిన గాయాలయ్యాయని జిల్లా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరికీ ఎటువంటి ప్రాణ హాని లేదన్నారు.

"పిల్లలకు నిప్పంటించాడని ఓ మహిళ తన భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అతన్ని అదుపులోకి తీసుకున్నాం. విచారణ అనంతరం నిందితున్ని జైలుకు పంపనున్నాం. అక్టోబర్ 30వ తేదీ ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది."
-బిజ్​నోర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర వశిష్ట్

మరోపక్క, వైఫై పాస్​వర్డ్ చెప్పలేదని 17 ఏళ్ల బాలుడిని చంపేశారు ఇద్దరు వ్యక్తులు. ఈ కిరాతక ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబాయిలోని కమోతే ప్రాంతంలో జరిగింది. ముందుగా తమలో తామే గొడవపడ్డ నిందితులు అనంతరం బాలున్ని కత్తితో పొడిచారని ముంబయి ఒకటో జోన్ డీసీపీ పన్సారే తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.