ETV Bharat / bharat

Father and Two Daughters Suicide : పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణం! - తెలంగాణ నేర వార్తలు

Committed Suicide
Father and Two Daughters Committed Suicide
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 7:37 AM IST

Updated : Oct 13, 2023, 4:36 PM IST

07:33 October 13

Father and Two Daughters Suicide : కుటుంబ కలహాలతో తండ్రి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య

Father and Two Daughters Suicide కుటుంబ కలహాలతో తండ్రి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య

Father and Two Daughters Suicide in Secunderabad : సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. భవానీనగర్‌ కాలనీలో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతోనే ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య జరిగిన తీరును పరిశీలించి ఘటనపై కుటుంబ సభ్యులను, చుట్టుపక్కల వారిని ఆరా తీస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని భవానీనగర్‌లో నివాసం ఉండే శ్రీకాంతాచారికి(42), భూదాన్‌ పోచంపల్లికి చెందిన అక్షయకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు శ్రావ్య(7), స్రవంతి(8) ఉన్నారు. శ్రీకాంత్‌ సిల్వర్‌ వ్యాపారం చేస్తుంటాడు. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసి, నిద్రించారు. ఉదయం శ్రీకాంతాచారితో పాటు ఇద్దరు పిల్లలు శ్రావ్య, స్రవంతి విగతజీవులుగా పడి ఉన్నారు. భార్య అక్షయ గమనించి, కింది అంతస్థులో ఉన్న తన అత్తకు తెలిపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వచ్చి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

"రోజులాగే వెళ్లి పైన పడుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియడం లేదు. అందరం ఒకే దగ్గర పడుకున్నాం. ఉదయం నేను లేచి చూసేసరికి నా భర్త, ఇద్దరు పిల్లలు విగత జీవులుగా కనిపించారు. పెద్ద పాప వాష్​రూంలో పడిపోయి కనిపించింది. చిన్న పాప, భర్త గదిలో విగత జీవులుగా కనిపించారు. ఎంత లేపినా లేవకపోయేసరికి చనిపోయారని నిర్ధారించుకున్నాం." - అక్షయ, శ్రీకాంత్‌ భార్య

Three Persons Suicide in Secunderabad : 2 నెలల క్రితం శ్రీకాంతాచారి వ్యాపారం కోసం తల్లి వద్ద రూ.10 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బును వికలాంగుల కోటాలో ఉద్యోగం ఇప్పిస్తానంటే ఓ దళారీకి ఇచ్చాడు. ఉద్యోగం రాకపోవడంతో దళారి రూ.8 లక్షలు శ్రీకాంతాచారికి తిరిగి చెల్లించగా.. మిగతా రూ.2 లక్షలు రావాల్సి ఉంది. రూ.10 లక్షల విషయంలో భార్య, భర్తల మధ్య గొడవలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం రాత్రి శ్రీకాంతాచారి తన షాపు నుంచి సైనైడ్ తీసుకొచ్చి.. భార్య, పిల్లలు గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత కుమార్తెల నోట్లో పోసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత భార్య నోట్లో పోసినా.. పక్కకు పడిపోయింది. తర్వాత శ్రీకాంతాచారి సైతం సైనైడ్ సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. గాఢ నిద్రలో ఉన్న భార్య, శ్రీకాంతాచారి తన నోట్లో సైనైడ్ పోసే ప్రయత్నం చేసిన విషయాన్ని కూడా గుర్తించలేకపోయింది. తెల్లవారుజామున నిద్ర లేచే సరికి పిల్లలు, భర్త మృతి చెందినట్లు ఆమె పోలీసులకు తెలిపింది.

"బోయిన్​పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలో ముగ్గురు చనిపోయారని సమాచారం వచ్చింది. తండ్రి.. ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోయారు. సంఘటనా స్థలంలో ఉన్న క్లూస్​ సేకరించాం. రిపోర్ట్ వచ్చాక ఇతర సమాచారం చెప్తాం. తల్లి ఫిర్యాదు చేసింది. నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం." - లక్ష్మీ నారాయణ, బోయిన్​పల్లి సీఐ

స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలను విచారిస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్‌ టీం శ్రీకాంత్‌ నిద్రించిన ఇంట్లో ఆధారాలు సేకరించింది. ప్రాథమికంగా అక్షయను ప్రశ్నించిన పోలీసులు మరింత లోతుగా విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీకాంత్​తో పాటు ఇద్దరు పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత వీరి మరణానికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.

A woman dealer brutally murdered in Peddapalli district : పెద్దపల్లి జిల్లాలో మహిళా డీలర్ దారుణహత్య

Constable Killed Mother in law in Hanamakonda : అత్తను గన్​తో కాల్చి చంపిన కానిస్టేబుల్.. అందుకోసమే..

Last Updated : Oct 13, 2023, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.