నవంబరు 29న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభకానున్న నేపథ్యంలో.. ఆరోజు రైతులు నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని వాయిదా(Faremrs tractor rally suspended) వేస్తున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)(Samyukta kisan morcha) తెలిపింది. శనివారం దిల్లీలో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం(Skm tractor rally) తీసుకుంది. తదుపరి కార్యాచరణపై వచ్చే నెలలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత కల్పించాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు దిల్లీలో ఎస్కేఎం నేత దర్శన్పాల్.. విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
"సోమవారం నిర్వహించాలని భావించిన ట్రాక్టర్ ర్యాలీని మేం వాయిదా వేస్తున్నాం. రైతులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ప్రధాని మోదీకి మేం లేఖ రాశాం. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం స్మారక భవనం నిర్మించేందుకు భూమి కేటాయించాలని కోరాం. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రను పదవి నుంచి తొలగించడం సహా వివిధ అంశాలను లేఖ ద్వారా ఆయన దృష్టికి తీసుకువెళ్లాం."
-దర్శన్పాల్, ఎస్కేఎం నేత
ప్రధానమంత్రి నుంచి ప్రత్యుత్తరం కోసం తాము వేచి చూస్తున్నామని దర్శన్పాల్ తెలిపారు. డిసెంబరు 4న మరో సమావేశం నిర్వహించి, తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
తమ డిమాండ్లను నెరవేర్చాలని దిల్లీ సరిహద్దుల నుంచి పార్లమెంటు వరకు ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించాలని ముందు ఎస్కేఎం భావించింది. అయితే.. పార్లమెంటు సమావేశాల తొలిరోజున 'సాగు చట్టాల రద్దు బిల్లు'ను కేంద్రం ప్రవేశపెట్టనున్న తరుణంలో రైతుల ట్రాక్టర్ ర్యాలీని వాయిదా వేయాలని ఎస్కేఎం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ రైతు సంఘాలు దాదాపు ఏడాది కాలంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 19న గురునానక్ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi).. కొత్త సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని (farm laws repealed) సంచలన ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను ఈ శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: