కేంద్రం ఆహ్వనిస్తే సాగు చట్టాలపై చర్చించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. అయితే.. రైతుల డిమాండ్లలో ఎలాంటి మార్పులుండబోవని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్నందున రైతులు చర్చలు జరపాలని హరియాణా సీఎం నరేంద్ర సింగ్ తోమర్ కోరిన నేపథ్యంలో టికాయిత్ ఈ మేరకు స్పందించారు.
కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు టికాయిత్. కనీస మద్దతు ధరతో కూడిన కొత్త చట్టాలను తీసుకురావాలని అన్నారు. చర్చలకు సంయుక్త కిసాన్ మోర్చాను పిలవాలని సూచించారు.
ఇదీ చదవండి: కరోనా విలయం: ఒక్కరోజే 1,68,912 కేసులు