ETV Bharat / bharat

ట్రాక్టర్ ర్యాలీపై సోమవారం సుప్రీం విచారణ

author img

By

Published : Jan 17, 2021, 12:57 PM IST

ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. సీజేఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారించనుంది.

Farmers' protest tractor rally
ట్రాక్టర్ ర్యాలీపై సోమవారం సుప్రీం విచారణ

దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ వ్యాజ్యంపై వాదనలు విననుంది. దీంతో పాటు రైతుల సమస్యలపై దాఖలైన పిటిషన్లను సైతం విచారించనుంది.

దిల్లీ పోలీసు విభాగం ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేయించింది కేంద్రం. గణతంత్ర వేడుకలకు విఘాతం కలిగించేందుకు, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు ట్రాక్టర్ల కవాతును నిర్వహించాలని కొన్ని వర్గాలు భావిస్తున్నట్లు అందులో పేర్కొంది. ఈ చర్య యావద్దేశానికి ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తుందని వివరించింది. ఏటా గణతంత్ర దినోత్సవాలను అధికారికంగా నిర్వహించుకోవడం రాజ్యాంగపరమైన, చారిత్రకపరమైన ఆవశ్యకతను కలిగి ఉందని తెలిపింది.

26వ తేదీకి మూడు రోజుల ముందు నుంచే రిహార్సల్స్‌ జరుగుతాయి. కనుక దేశ రాజధాని ప్రాంతంలో ఏ రూపంలోనూ నిరసనలు, ధర్నాలు, కవాతులు నిర్వహించకుండా నిలువరించాలి అని దిల్లీ పోలీసు విభాగం సుప్రీంకోర్టుకు విన్నవించింది.

అయితే హరియాణా-దిల్లీ సరిహద్దుల్లోనే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని రైతులు చెప్పినట్లు సమాచారం. రిపబ్లిక్ డే పరేడ్​కు విఘాతం కలిగించేందుకు ఎర్రకోట వైపు వెళ్లడం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఐస్​క్రీంలో కరోనా వైరస్- కొన్నవారికోసం గాలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.