ETV Bharat / bharat

'కేంద్రానికి రైతుల హెచ్చరిక- మోదీ దిగిరాకుంటే దిగ్బంధమే'

Farmers protest against Centre's farm laws enters 15th day
పట్టువీడని రైతన్న- 15వ రోజుకు చేరిన నిరసనలు
author img

By

Published : Dec 10, 2020, 9:17 AM IST

Updated : Dec 10, 2020, 5:33 PM IST

17:27 December 10

రైతు సంఘాల హెచ్చరిక..

డిసెంబర్​ 10లోగా ప్రధాని నరేంద్ర మోదీ తమ మాట వినకుంటే, చట్టాలను రద్దు చేయకుంటే మేం రైల్వే ట్రాక్​లను దిగ్బంధిస్తామని ఆల్టిమేటం జారీ చేసినట్లు రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. భారత ప్రజలంతా రైల్వే ట్రాక్​ల వద్దకు చేరుకోవాలని ఇవాళ సమావేశంలో నిర్ణయించినట్లు రైతు సంఘాల ప్రతినిధి బూటా సింగ్​. సంయుక్త్​ కిసాన్​ మంచ్​ త్వరలోనే దీనిపై తేదీ ఖరారు చేస్తుందని స్పష్టం చేశారు. 

16:46 December 10

ఆందోళనలు విరమించండి: తోమర్​

కేంద్రం పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని స్పందించాలని, చర్చలు జరిపేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు వ్యవసాయ మంత్రి. చలికాలంలో, ఇంకా కరోనా పరిస్థితుల్లో నిరసనలు చేస్తున్న రైతుల పట్ల ఆందోళన చెందుతున్నట్లు వ్యాఖ్యానించారు. ఆందోళనలు తక్షణమే విరమించి.. చర్చలకు రావాలని కోరారు. 

16:42 December 10

వారివి భయాలే: తోమర్​

''రైతులు తమ భూములను పారిశ్రామికవేత్తలు స్వాధీనం చేసుకుంటారని భయపడుతున్నారు. గుజరాత్​, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్​, కర్ణాటకల్లో సుదీర్ఘ కాలంగా కాంట్రాక్ట్​ ఫార్మింగ్​ కొనసాగుతోంది. అక్కడ ఇలాంటి సమస్యలు ఎప్పుడూ చూడలేదు కదా. రైతుల భూమిపై లీజు లేదా ఒప్పందాల గురించి మేం చట్టాల్లో ఎలాంటి నిబంధన పెట్టలేదు కదా.''

    - నరేంద్ర సింగ్​ తోమర్​, కేంద్ర వ్యవసాయ మంత్రి

16:38 December 10

అది మా హక్కే: తోమర్​

'' వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందని, కావున కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలు చెల్లవని చర్చల సందర్భంగా కొందరు వ్యాఖ్యానించారు. కానీ.. దీనిపై మేం స్పష్టతనిచ్చాం. వాణిజ్యంపై చట్టాలు చేసేందుకు మాకు హక్కు ఉంది. ఏపీఎంసీ, ఎంఎస్​పీ దీనివల్ల ప్రభావితం ఏం కావు.''

16:33 December 10

ఎప్పటికీ సిద్ధమే: తోమర్​

రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎప్పటికీ సిద్ధంగానే ఉంటుందని వ్యాఖ్యానించారు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. రైతులు వారి అభ్యంతరాలపై సలహాలు ఇస్తారని ఎదురుచూస్తున్నామని, కానీ రైతులు చట్టాలను రద్దు చేయాలన్న దగ్గరే ఆగిపోయారని అన్నారు. రైతుల సమస్యలకు పరిష్కారం కేంద్రం ప్రయత్నిస్తోందని, ప్రతి అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 

16:30 December 10

ప్రభుత్వం కట్టుబడి ఉంది: తోమర్​

''మేం రైతులకు ఓ ప్రతిపాదన పంపాం. అయితే.. వారు చట్టాలను రద్దు చేయాలనే పట్టుబడుతున్నారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలపై చర్చించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ చట్టాలతో కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ), ఏపీఎంసీలపై ప్రభావం చూపవు. ఇదే మేం రైతులకు వివరించాలని అనుకుంటున్నాం.''

        - నరేంద్ర సింగ్​ తోమర్​, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి 

16:16 December 10

వ్యవసాయ చట్టాలపై తోమర్​..

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ మీడియాతో మాట్లాడుతున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. 

  • వ్యవసాయ సంస్కరణలకు చట్టాలు కూడా తప్పనిసరి: తోమర్‌
  • రైతుల కోసం ప్రధాని మోదీ ఎన్నో సంస్కరణలు తెచ్చారు: తోమర్‌
  • యూరియా బ్లాక్‌ మార్కెట్‌ను అడ్డుకున్నాం: తోమర్‌
  • ప్రస్తుతం ఎక్కడా యూరియా కొరత లేదు:  తోమర్‌
  • రైతులు తమ పంటను ఎక్కడైనా, ఎవరికైనా తమకు నచ్చిన ధరకు అమ్ముకునే అవకాశం కేంద్రం కల్పించింది: తోమర్​
  • స్వేచ్ఛాయుత పంట విక్రయాలను ఎందుకు అడ్డుకుంటున్నారు: తోమర్‌
  • రైతుల భద్రత కోసమే ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది: తోమర్‌
  • వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది: తోమర్​
  • రైతుల ప్రయోజనాల కోసం మోదీ సర్కార్​ పనిచేస్తుంది: తోమర్​

11:46 December 10

"సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలను తక్షణమే విరమించి, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ రైతులకు మరోమారు విజ్ఞప్తి చేయనున్నారు. ఇదే అంశంపై మీడియా సమావేశం నిర్వహించనున్నారు." అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

09:01 December 10

15వ రోజుకు..

దేశ రాజధాని దిల్లీలో రైతులు తలపెట్టిన ఆందోళనలు 15వ రోజుకు చేరాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు ఈ నిరసనలు చేపట్టారు. దిల్లీ-హరియాణా సరిహద్దులోని టిక్రి వద్ద కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Last Updated : Dec 10, 2020, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.