ETV Bharat / bharat

తోమర్​తో రైతుల బృందం భేటీ- చట్టాలకు మద్దతు - హరియాణా రైతుల సంఘం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. 20మందితో కూడిన రైతుల బృందం.. కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసింది. కొత్త వ్యవసాయ చట్టాలకు తాము మద్దతిస్తున్నట్టు తెలిపింది. చట్టాలను రద్దు చేయాల్సిన పనిలేదని.. కొన్ని సవరణలు చేస్తే సరిపోతుందని పేర్కొంది.

Farmers' group in support of new laws meet Agri Minister; seek amendments, not repeal
కొత్త సాగు చట్టాలకు హరియాణా రైతుల మద్దతు
author img

By

Published : Dec 7, 2020, 10:11 PM IST

Updated : Dec 7, 2020, 10:57 PM IST

దేశ రాజధాని దిల్లీలో కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ను కలిసింది 20మంది సభ్యులతో కూడిన రైతుల బృందం. నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు ప్రకటించింది. దేశవ్యాప్తంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో ఈ బృందం వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన దిల్లీ సీఎం

ఈ బృందంలో హరియాణాకు చెందిన రైతులే అధికంగా ఉన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కమల్​ సింగ్​ చవాన్​ నేతృత్వంలోని 'ప్రగతిశీల రైతుల' బృందం.. కేంద్ర మంత్రిని కలిసి.. కొత్త చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. వాటిలో కొన్ని సవరణలు చేస్తే సరిపోతుందని సూచించింది. ఈ ప్రతినిధుల బృందంలో భారతీయ కిసాన్​ యూనియన్​(అత్తార్​) జాతీయాధ్యక్షుడు అత్తార్​ సింగ్​ సంధు కూడా ఉన్నారు.

ఇదీ చదవండి: మంగళవారం 'భారత్​ బంద్​'- అన్ని వర్గాల మద్దతు!

గత కొన్ని రోజులుగా దేశ రాజధాని దిల్లీలో రైతులు ఆందోళనలు చేపట్టారు. ఆరో దఫా చర్చల్లో భాగంగా.. ఈ నెల 9న కేంద్రం, మరోసారి కర్షకులతో చర్చించనుంది. చట్టాలను రద్దు చేయకుండా నిర్దిష్ట సమస్యలను పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. అయినప్పటికీ వీటిని రద్దు చేయాల్సిందేనన్న డిమాండ్​కు రైతన్నలు కట్టుబడి ఉన్నారు. ఫలితంగా ఇప్పటివరకు జరిగిన ఐదు రౌండ్ల సమావేశాల్లో ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది కేంద్రం.

ఇవీ చదవండి:

సాగు చట్టాలపై విపక్షాలు గరం​- భాజపా ఫైర్​

రైతుల విషయంలో భాజపాకు ఆ రెండే అడ్డంకి?

Last Updated : Dec 7, 2020, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.