హరియాణాలోని సోనీపత్లో కుండ్లీ పశ్చిమ ఫెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేను దిగ్బంధించారు రైతులు. ముందుగా ప్రకటించినట్లు ఈ రోజు (శనివారం) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగనుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం 100 రోజులకు చేరిన సందర్భంగా తమ పోరును విస్తృతం చేయడంలో భాగంగా రహదారులను దిగ్బంధిస్తున్నారు కర్షకులు.
ఇదీ చూడండి: 100వ రోజుకు చేరిన రైతు ఉద్యమం