Onion Farmer profit: మహారాష్ట్ర కొల్హాపుర్లో ఓ రైతుకు చేదు అనుభవం ఎదురైంది. తన పంటను విక్రయియంచిన ఆ వ్యక్తికి కనీసం టిఫిన్ ఖర్చులు కూడా తిరిగి రాలేదు. సోలాపుర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో 11 వందల కిలోల ఉల్లిగడ్డలను విక్రయించిన రైతు.. రూ.13 మాత్రమే సంపాదించారు. ఇందుకు సంబంధించిన అమ్మకాల రసీదు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Maharashtra farmer onion MSP:
రెండు రోజుల క్రితం బాబు కడ్వే అనే రైతు.. సోలాపుర్ మండీలో రుద్రేశ్ పాటిల్ అనే వ్యాపారికి 24 బస్తాల ఉల్లిని విక్రయించారు. మొత్తం 1123 కేజీల ఉల్లిని విక్రయించగా.. రూ.1665 వచ్చాయి. అయితే, రవాణా ఖర్చులు, ఇతర ఛార్జీలను తీసేస్తే లాభం రూ.13 మాత్రమే వచ్చింది.
దీనిపై రైతు నాయకుడు రాజు శెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు సానుభూతి తెలిపిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల రైతులకు మద్దతు ధర లభించడం లేదని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాలను రైతులు గద్దె దించుతారని హెచ్చరించారు.
ఇదీ చదవండి: భార్యతో గొడవ.. కోపంలో ఏడేళ్ల కూతురిని కడతేర్చిన తండ్రి