ETV Bharat / bharat

హాథ్రస్​లో రైతు హత్య- వేధింపుల కేసే కారణం!

author img

By

Published : Mar 2, 2021, 10:33 AM IST

Updated : Mar 2, 2021, 11:36 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో రైతును కాల్చి చంపారు కొందరు దుండగులు. గతంలో తన కుమార్తెను వేధించిన వారిపై ఫిర్యాదు చేశాడనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

UP: Farmer shot dead in Hathras
హాథ్రస్​లో రైతును కాల్చి చంపిన దుండగులు

ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్‌లో దారుణం జరిగింది. కొత్వాలి సాస్ని ప్రాంతంలోని నౌజర్‌పుర్​ గ్రామంలో ఓ రైతును.. అతని పొలంలోనే కాల్చి చంపారు కొందరు దుండగులు. పాత కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పాత కక్షలే కారణమా?

నిందితుడు గౌరవ్​ శర్మ, మరణించిన రైతు అమ్రిశ్​ కుమార్​ శర్మ(48)కు మధ్య పాతకక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తన కుమార్తెను కొందరు వేధిస్తున్నారని 2018లో రైతు(మృతుడు) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ఘటనతో సంబంధం ఉన్న నలుగురుపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు.. అప్పట్లో ఇద్దరిని అరెస్టు చేశారు.

తాజాగా ప్రధాన నిందితుడు గౌరవ్​ భార్య, అత్త.. అటు రైతు కుమార్తెలు ఇద్దరు సోమవారం దేవాలయానికి వెళ్లారు. అక్కడే పాత గొడవలు కదిలి.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం అప్పటికే ఆవేశంతో రగిలిపోతున్న గౌరవ్​కు తెలిసింది. దీంతో పొలంలో బంగాళదుంపలు తవ్వుతున్న రైతు దగ్గరకు తన అనుచరులతో వెళ్లి దాడి చేశాడు. ఈ క్రమంలోనే గౌరవ్​ కాల్పులు జరిపాడన్నది రైతు కుమార్తె ఆరోపణ. గాయపడిన రైతును ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు.

అమ్రిశ్​ కుమార్ కుమార్తె అందించిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం

రైతు హత్యకేసుతో సంబంధం ఉన్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం యోగి ఆధిత్యనాథ్​ ఆదేశించారు.

ఇదీ చూడండి: ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి

Last Updated : Mar 2, 2021, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.