నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన ఆరోరోజు కొనసాగుతోంది. దిల్లీ సరిహద్దుల వద్ద పెద్దఎత్తున భైఠాయించిన రైతులు ఎముకలు కొరికే చలిలోనూ పోరాటం కొనసాగిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి చర్చల ప్రతిపాదన రాగా రైతు సంఘాలు సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. రైతులతో చర్చలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.
ఈ భేటీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌తో పాటు మరికొందరు మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులతో భేటీలో చర్చించే అంశాలపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర తోమర్ సమావేశమయ్యారు.
చర్చలకు రండి..
దిల్లీలో తీవ్రమైన చలి, కరోనా విస్తృతి దృష్ట్యా డిసెంబర్ 3కు బదులు ఈరోజే చర్చలకు రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానించింది. మధ్యాహ్నం 3 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. నవంబర్ 13న జరిగిన మొదటి రౌండ్ చర్చలకు వచ్చిన రైతు నాయకులనే ఈ దఫా కూడా ఆహ్వానించినట్లు చెప్పారు.
చర్చకు వస్తారా?
ఈ నేపథ్యంలో చర్చల ప్రతిపాదనపై రైతు సంఘాలు సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకోనున్నాయి. మరికొన్ని రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానిస్తేనే సమావేశానికి హాజరవుతామని తేల్చి చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 500లకు పైగా రైతుసంఘాలు ఉంటే కేవలం 32 సంఘాలనే ప్రభుత్వం చర్చలకు పిలిచిందని పంజాబ్ కిసాన్ సంఘర్ష్ కమిటీ తెలిపింది. అన్ని సంఘాలను పిలిస్తే తప్ప చర్చలకు హాజరయ్యే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది.
ఆందోళన ఉద్ధృతం..
పంజాబ్‌తోపాటు పలు రాష్ట్రాల నుంచి దిల్లీకి చేరుకున్న రైతులు సింఘు, టిక్రీ, ఘాజిపుర్ సరిహద్దుల వద్ద ఎముకలు కొరికే చలిలోనూ పోరాటం సాగిస్తున్నారు. చలిని లెక్కచేయకుండా ట్రాక్టర్ ట్రాలీలపై టార్పిన్లు కప్పి వాటినే గుడారాలుగా మార్చుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఆందోళనల నేపథ్యంలో సింఘు, టిక్రీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. నిర్ణయాత్మక పోరుకు సిద్ధపడే హస్తినకు వచ్చామని అన్నదాతలు అంటున్నారు. మోదీ సర్కారు తమ మనసులోని మాటను వినాలని కోరుతున్నారు
ఉద్రిక్తం..
నిరసనల సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఘాజీపూర్ వద్ద ఉద్రిక్తతలు తలెత్తాయి. ఘాజీపుర్ వద్దకు పెద్దసంఖ్యలో అన్నదాతలు చేరుకున్నారు. వారు దిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు బ్యారీకేడ్లను అడ్డుగా పెట్టారు. అయితే రైతులు ట్రాక్టర్ల సాయంతో బ్యారికేడ్లను తొలగించేందుకు యత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది. బురాడీలోని నిరంకారీ మైదానంలోనూ కొంతమంది రైతులు ధర్నా కొనసాగిస్తున్నారు.
-
#WATCH Protesting farmers use a tractor to remove barricading done at Ghazipur-Ghaziabad (Delhi-UP) border#FarmersProtest #Ghaziabad pic.twitter.com/g3VfCMFEAI
— ANI (@ANI) December 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Protesting farmers use a tractor to remove barricading done at Ghazipur-Ghaziabad (Delhi-UP) border#FarmersProtest #Ghaziabad pic.twitter.com/g3VfCMFEAI
— ANI (@ANI) December 1, 2020#WATCH Protesting farmers use a tractor to remove barricading done at Ghazipur-Ghaziabad (Delhi-UP) border#FarmersProtest #Ghaziabad pic.twitter.com/g3VfCMFEAI
— ANI (@ANI) December 1, 2020
హరియాణాలో..
హరియాణాలోనూ రైతుల నిరసన ఉద్ధృతంగా సాగుతోంది. సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా ప్రార్థనల కోసం అంబాలాలోని గురుద్వారాకు వచ్చిన ఆ రాష్ట్ర మంత్రి అనిల్‌విజ్‌కు నిరసన సెగ తగిలింది. రైతులు ఆయనకు నల్ల జెండాలు చూపించి.. కిసాన్ ఏక్తా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
-
#WATCH Farmers in Ambala raised slogans of 'Kisan Ekta Zindabad' and showed black flags to Haryana minister Anil Vij outside Panjokhra Sahib Gurudwara yesterday. #Haryana pic.twitter.com/kdpbSOvel1
— ANI (@ANI) December 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Farmers in Ambala raised slogans of 'Kisan Ekta Zindabad' and showed black flags to Haryana minister Anil Vij outside Panjokhra Sahib Gurudwara yesterday. #Haryana pic.twitter.com/kdpbSOvel1
— ANI (@ANI) December 1, 2020#WATCH Farmers in Ambala raised slogans of 'Kisan Ekta Zindabad' and showed black flags to Haryana minister Anil Vij outside Panjokhra Sahib Gurudwara yesterday. #Haryana pic.twitter.com/kdpbSOvel1
— ANI (@ANI) December 1, 2020
- ఇదీ చూడండి: రిజర్వేషన్ పోరు-చెన్నైలో ఉద్రిక్తత