కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వ్యాక్సినే ప్రధాన ఆయుధమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. కొంత మంది వింత పద్ధతులను అనుసరిస్తున్నారు. తమిళనాడులో ఓ వ్యక్తి.. బతికున్న పామును తింటే వైరస్ను ఓడించవచ్చు అని చెప్పాడు.
ఏం జరిగిందంటే..
తమిళనాడు మదురై జిల్లాలోని పెరుమల్పట్టి గ్రామానికి చెందిన వడివేలు అనే ఓ రైతు గురువారం ఓ బతికున్న పామును తిన్నాడు. అంతేగాకుండా.. ఇది కరోనాకు దివ్యౌషధం అని చెప్పాడు.
పామును వడివేలు తింటుండగా పక్కనే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్లో వీడియో తీశాడు. సామాజిక మాధ్యమాల్లో ఇది వైరల్గా మారింది.
ఇదీ చూడండి: కరెంటు తీగలు రాసుకొని మంటలు- పేలిన సిలిండర్
ఇదీ చూడండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం-ఐదుగురు మృతి