ETV Bharat / bharat

'రద్దయిన చట్టాలను మళ్లీ తీసుకువచ్చే యోచన లేదు' - మళ్లీ సాగు చట్టాలు

Farm Laws Repeal: సాగు చట్టాల విషయంలో తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో వివరణ ఇచ్చారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్. సాగు చట్టాలను మళ్లీ తీసుకువచ్చే ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

Farm Laws Repeal
నరేంద్ర సింగ్ తోమర్​
author img

By

Published : Dec 26, 2021, 11:41 PM IST

Updated : Dec 27, 2021, 1:47 AM IST

Farm Laws Repeal: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విమర్శించారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకువచ్చే ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో దేశప్రజలను తప్పుదోవ పట్టించడానికి కొంతమంది యత్నిస్తున్నారని ఆరోపించారు.

"సాగు చట్టాలను మళ్లీ తీసుకువచ్చే ప్రణాళిక ఏదీ కేంద్రానికి లేదు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు ఈ విషయంపై చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. నా ప్రకటనను తప్పుగా ప్రచారం చేస్తూ.. దేశాన్ని తప్పుదోవ పట్టించడానికి వాళ్లు విఫలయత్నం చేశారు. రద్దు చేసిన చట్టాలను మళ్లీ తీసుకువచ్చే యోచన లేనే లేదు."

-నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

Tomar on farm laws: నాగ్‌పుర్‌లో శుక్రవారం జరిగిన అగ్రో విజన్‌ ఎక్స్‌పో కార్యక్రమంలో నరేంద్ర సింగ్‌ తోమర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "వ్యవసాయంలో సంస్కరణలో కోసం తీసుకువచ్చిన సాగు చట్టాలను నల్ల చట్టాలుగా ప్రచారం చేసి వాటిని రద్దు చేయించారు. కానీ ప్రభుత్వం ఏం అసంతృప్తి చెందడం లేదు. మేం ఒక అడుగు వెనక్కి వేశాం. కానీ తప్పకుండా మళ్లీ ముందడుగు వేస్తాం. ఎందుకంటే రైతులే ఈ దేశానికి వెన్నెముక" అని అన్నారు.

'మళ్లీ తీసుకొచ్చే కుట్ర'

తోమర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత 'సాగు చట్టాలను మళ్లీ తీసుకొచ్చే కుట్రను భాజపా నేతలు అమలు చేస్తారేమోన'నే సందేహాన్ని వ్యక్తం చేసింది. 'రైతు వ్యతిరేక చర్యలు తీసుకున్నట్లయితే అన్నదాతలు మళ్లీ సత్యాగ్రహం ప్రారంభిస్తార'ని రాహుల్ గాంధీ హెచ్చరించారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలనే కుట్ర తోమర్‌ వ్యాఖ్యలతో బహిర్గతమైందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో తోమర్ ఆదివారం ఈ తాజా వివరణ ఇచ్చారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకొచ్చే ఉద్దేశం లేదని చెప్పారు.

'ఓడిస్తే.. మళ్లీ ఆ ధైర్యం చేయరు'

తోమర్ వివరణ ఇచ్చినప్పటికీ సాగు చట్టాల విషయంలో కాంగ్రెస్ తన అనుమానాలను మరోసారి వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సాగు చట్టాలను మళ్లీ తీసుకువచ్చేందుకు కుట్ర పన్నుతోందని మరోసారి ఆరోపించింది. ప్రధానమంత్రి ఆజ్ఞానుసారమే తోమర్ శనివారం సాగు చట్టాలపై ప్రకటన చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా తెలిపారు.

"700 మంది రైతుల త్యాగాలు, 380 రోజుల సుదీర్ఘ నిరసనలతో రైతులకు, రైతు కూలీలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలు రద్దయ్యాయి. అయితే.. ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో తమ ఓటమిని గ్రహించే.. ప్రభుత్వం ఈ చట్టాలపై వెనక్కు తగ్గింది. ఎన్నికలు ముగియగానే వాళ్లు చట్టాలను మళ్లీ తీసుకువస్తుంది."

-రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి.

"కేంద్రం కుట్రను నిలువరించాలంటే ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో భాజపాను ఓడించాలని మేం నిన్న పిలుపునిచ్చాం. అలా చేస్తే ఆ చట్టాలను మళ్లీ తీసుకువచ్చే ధైర్యం వాళ్లు చేయరు" అని సుర్జేవాలా చెప్పారు.

ఇదీ చూడండి: కేంద్రం కీలక నిర్ణయం- ఆ వివాదాస్పద చట్టం ఎత్తివేసే దిశగా అడుగులు!

ఇదీ చూడండి: 'వివాహ వివాదాల్లో పదేపదే వారిని నిందితులుగా మారుస్తున్నారు'

Last Updated : Dec 27, 2021, 1:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.