ETV Bharat / bharat

యువకుడి బ్రెయిన్ డెడ్​.. అవయవ దానంతో నలుగురికి పునర్జన్మ - బ్రెయిన్​డెడ్​ యువకుడి అవయవదానం

Organ donation: రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్​ డెడ్​ అయిన ఓ యువకుడి అవయవాలను దానం చేశారు కుటుంబసభ్యులు. ఫలితంగా నలుగురికి పునర్జన్మనిచ్చారు.

Family of brain dead youth donates organs
యువకుడి బ్రెయిన్ డెడ్​.. అవయవ దానంతో నలుగురికి పునర్జన్మ
author img

By

Published : Feb 22, 2022, 12:23 PM IST

Brain dead youth organ donation: తమ కుమారుడు ఇక బతకడని తెలిసి నలుగురి జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంది ఆ కుటుంబం. బ్రెయిన్ డెడ్​ అయిన తమ బిడ్డ అవయవాలను దానం చేసింది. ఫలితంగా నలుగురికి పునర్జన్మనిచ్చింది. సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలిచింది.

రాజస్థాన్​ సీకర్​కు చెందిన సునీల్​ సాయి ఈనెల 16న కారులో ఇంటికి వస్తుండగా మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడ్ని మొదట ఎస్​కే ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పరిస్థితి విషమించడం వల్ల జైపుర్​లోని సవాయి మాన్​సింగ్ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. వైద్యులు అతడి బ్రెయిన్ డెడ్​ అయిందని ప్రకటించారు. బతకడం కష్టమని తేల్చారు. దీంతో తమ కుమారుడి అవయవాలు దానం చేస్తే ఇతరులకు జీవం పోసినట్లవుతుందని భావించిన కుటుంబం.. అతడి అవయవాలు డోనేట్​ చేసింది. దీంతో వైద్యులు సునీల్​ రెండు కిడ్నీలను ఇతరులకు అమర్చారు. గుండెను గ్రీన్ కారిడార్​ ద్వారా ఇటర్నల్ అస్పత్రికి తరలించి మరొకరికి పునర్జన్మనిచ్చారు. లివర్​ను మనిపాల్​ ఆస్పత్రిలో ఓ వ్యక్తికి అమర్చారు. ఇలా నలుగురికి కొత్త జీవితాన్నిచ్చారు.

ఇదీ చదవండి: భార్యను కొట్టి, నోట్లో వస్త్రం కుక్కి సెక్స్​- కోర్టు ఏం చేసిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.