ETV Bharat / bharat

మతిస్తిమితం కోల్పోయిందని...15 ఏళ్లుగా గొలుసుతో కట్టేసి..

ఆమె ఒక సాధారణ మహిళ. 2006లో వివాహం చేసుకుంది. ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. అకస్మాత్తుగా మతిస్తిమితం కోల్పోవడం వల్ల అత్తింటివారు బయటకు గెంటేశారు. చేసేదేమి లేక పుట్టింటికి చేరుకుంది. అప్పటి నుంచి రోజుకి 8 గంటల పాటు గొలుసుతో బంధించి తమ పనులకు కుటుంబీకులు వెళ్తున్నారు..సాయంత్రం తిరిగి వచ్చాక గొలుసు తొలగిస్తున్నారు. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్​లో వెలుగు చూసింది.

family-members-tie-woman
family-members-tie-woman
author img

By

Published : Feb 17, 2022, 1:10 PM IST

Updated : Feb 17, 2022, 5:48 PM IST

మహిళను గొలుసుతో కట్టేసిన కుటుంబసభ్యులు

మధ్యప్రదేశ్​లో 15 ఏళ్లుగా రోజుకు 8 గంటల పాటు ఓ మహిళను గొలుసుతో బంధిస్తున్న అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజూ కుటుంబసభ్యులు ఆ మహిళను గొలుసుతో ఇంటి గుమ్మం ముందు కట్టేసి తమ రోజువారీ పనులకు వెళ్తున్నారు. సాయంత్రం తిరిగి వచ్చాక గొలుసును తొలగిస్తున్నారు. ఈ ఘటన ఉజ్జయిని నగరం.. నగడా- పువాడియా ప్రాంతంలో జరిగింది.

అయితే ఆ మహిళ మతిస్తిమితం కోల్పోయిందని, గొలుసుతో కట్టకపోతే చుట్టూ ఉన్నవాళ్లకు ఇబ్బంది పెడుతుందని, అందుకే బంధిస్తున్నామని కుటుంబసభ్యులు చెప్తున్నారు.

" మా అక్కకు 2006లో వివాహం జరిగింది. 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మతిస్తిమితం కోల్పోవడం వల్ల భర్త వదిలేశాడు. అప్పటి నుంచి ఆమె ఆలనా పాలనా చూసుకుంటున్నాం. పలు మార్లు చికిత్స చేయించినా..ఎటువంటి ఫలితం లేదు. అందుకే గొలుసుతో బంధించాల్సి వచ్చింది."

- బాధితురాలి తమ్ముడు

మతిస్తిమితం కోల్పోయిన ఆ మహిళను బంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం వల్ల జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై కలెక్టర్ ఆశిష్ సింగ్ విచారణకు ఆదేశించారు.

ఇదీ చదవండి: పెళ్లి వేడుకలో ఘోరం... బావిలో పడి 13 మంది మహిళలు మృతి

Last Updated : Feb 17, 2022, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.