ETV Bharat / bharat

ఆరేళ్లుగా గుంతలోనే నివాసం.. తాగునీటికి కష్టం.. ప్రభుత్వ పథకాలకు దూరం - బంగాల్​లో లేటేస్ట న్యూస్

ప్రకృత్తి విపత్తుల నుంచి కాపాడుకోవడానికి ఓ కుటంబం గుంతలో జీవిస్తోంది. గత ఆరేళ్లుగా ఆ కుటుంబం రేకుల షెడ్డులో ఉన్న ఆ గుంతలోనే జీవనం సాగిస్తోంది. ప్రభుత్వ పథకాలు సైతం అందక నానా అవస్థలు పడుతోంది.

a family living in a pit for 6 years
a family living in a pit for 6 years
author img

By

Published : May 12, 2023, 9:38 AM IST

Updated : May 12, 2023, 10:35 AM IST

ఆరేళ్లుగా గుంతలోనే నివాసం

ఆరేళ్లుగా ఓ కుటుంబం.. గుంతలో నివసిస్తోంది. కనీసం తాగడానికి సరైన నీరు కూడా లేదు. గత ఆరేళ్లుగా వీరికి ఏ ప్రభుత్వ పథకం కూడా అందడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాలని అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు సైతం అందక నానా అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. ఈ కుటుంబం.. బంగాల్​ జల్పాయ్​​గుడిలోని అముగ్రి శివారులో ఛాప్​గఢ్​ గ్రామంలో ఉంటోంది.

కూలీ పనులు చేసుకుంటూ జీవించే లక్ష్మీ మోహన్​ రాయ్​కు పక్కా ఇల్లు లేదు. ఓ రేకుల షెడ్డులోని జీవనం సాగిస్తున్నాడు. వర్షం, తుపాను లాంటి ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు ఇల్లు పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో ఐదుగురు ఉన్న మోహన్ రాయ్ కుటుంబం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అధికారులు విన్నవించినా పట్టించుకోవడం లేదు. దీంతో రేకుల షెడ్డులోనే ఓ గుంతను తవ్వి భార్యభర్తలు సహా ఇద్దరు బాలికలు, అత్త ఐదుగురు అందులో తల దాచుకుంటున్నారు. ఈ కుటుంబానికి సరైన నీటి సదుపాయం కూడా లేదు. ఇంటి సమీపంలోనే ఓ చిన్న బావిని తవ్వుకుని ఆ నీటినే తాగుతున్నారు.

a family living in a pit for 6 years
మోహన్ రాయ్​ కుటుంబం ఉంటున్న రేకుల షెడ్డు

'ఇప్పటికే అనేక సార్లు కొట్టుకుపోయింది'
"ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే మా గురించి వెతుకుతారు. ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకునేవారే ఉండరు. చాలా కష్టపడి ఈ ఇల్లును కట్టుకున్నాం. అంతకుముందు ఉన్న ఇల్లు అనేక సార్లు గాలికి కొట్టుకుపోయింది. వర్షాలు, గాలులు, తుపానులు వచ్చినప్పుడు మా పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుంది." అని లక్ష్మీ మోహన్​రాయ్​ అత్త శోభా రాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభత్వ అధికారులు తమను పట్టించుకుని పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుతోంది.

"లక్ష్మీ మోహన్​ రాయ్​ అలీపుర్​దౌర్​ గ్రామంలో నివసించేవాడు. అతడికి అక్కడే రేషన్​ కార్డు ఉంది. ఫలితంగా ప్రభుత్వం నుంచి ఇక్కడ పథకాలు అందడం లేదు. కానీ అతడికి అవసరమైన సహాయం చేస్తున్నాం. కొన్ని రోజుల కిందే మాకు వీరి విషయం తెలిసింది. వెంటనే వారికి దీదీ సురక్ష కవచ్​ పథకం కింద నీటిపంపును ఏర్పాటు చేశాం. టాయిలెట్​ను కూడా కట్టించాం. మా గ్రామ పంచాయితీ సొంత డబ్బులతో వారికి ఇల్లు కట్టించి ఇస్తాం. బియ్యం, పప్పులు లాంటి నిత్యావసర సరకులను సమకూరుస్తాం."

--దిలీప్​ రాయ్​, అముగ్రి సర్పంచ్​

a family living in a pit for 6 years
నీటి గుంత
a family living in a pit for 6 years
గుంతలో ఉన్న కుటుంబం

ఇవీ చదవండి : భార్య ముక్కు కోసేసిన భర్త.. అడ్డొచ్చిన కుమార్తెకు ఉరి.. ఆపై సూసైడ్

'ప్రజాస్వామ్యం గెలిచింది.. అభివృద్ధి పరుగులే.. ఆ అధికారులకు 'మ్యూజిక్' వాయిస్తా!'

Last Updated : May 12, 2023, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.