ETV Bharat / bharat

యువతిపై ఐదారేళ్లుగా రేప్​కు పాల్పడుతున్న దొంగ స్వామీజీ, భార్య కూడా - fake swamiji harassment in benguluru

గత ఐదారేళ్లుగా యువతిపై రేప్​కు పాల్పడ్డాడు ఓ దొంగ స్వామీజీ. దీనికి నిందితుడి భార్య కూడా వత్తాసు పలికింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి రావడం వల్ల నిందితులు కటకటాల వెనక్కి వెళ్లారు. బెంగుళూరులోని అవహలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

FAKE SWAMIJI SEXUAL HARASSMENT
FAKE SWAMIJI SEXUAL HARASSMENT OF YOUNG WOMAN IN BENGALURU
author img

By

Published : Aug 23, 2022, 8:12 PM IST

Updated : Aug 23, 2022, 9:37 PM IST

FAKE SWAMIJI SEXUAL HARASSMENT: సమస్యలు తీరుస్తానని చెప్పి యువతిని నమ్మించాడో దొంగ స్వామీజీ. అమెలోని భక్తిని ఆసరాగా చేసుకుని తన ఇంటికి రమ్మన్నాడు. అనంతరం మత్తు మందు ఇచ్చి రేప్​ చేశాడు. దీనికి స్వామీజీ భార్యా కూడా సహకరించింది. దీంతో గత ఐదారేళ్లుగా బాధితురాలిని వేధిస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బెంగుళూరులోని అవహలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

వివరాల్లోకెళ్తే.. ఐదారేళ్ల క్రితం బాధితురాలు తన స్నేహితుల ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్​లో నిందితుడు ఆనందమూర్తికి పరిచయమైంది. అనంతరం బాధితురాలి జీవితంలో ప్రమాదం ఉందని, ఆమె కుటుంబ సభ్యులు కూడా చిక్కుల్లో ఇరుక్కుంటారని ఆనందమూర్తి యువతికి చెప్పాడు. తాను కాళికాదేవి భక్తుడిని, అన్ని సమస్యలు తీరుస్తానని నమ్మించాడు.

ఇవన్నీ నమ్మి బాధితురాలు అతడి ఇంటికి వెళ్లింది. పూజ చేయడానికి అని పిలిచి అనంతరం ఆమెకు మత్తుమందు ఇచ్చాడు. తర్వాత ఆమెను రేప్​ చేశాడు. దాన్ని నిందితుడి భార్య ఫోన్​లో చిత్రీకరించింది. మత్తులోంచి తేరుకున్నాక బాధితురాలు వివస్త్రగా ఉంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని దొంగ స్వామీజీ బెదిరించాడు. దీంతో భయపడిన యువతి, జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. దీన్ని అడ్డం పెట్టుకుని ఐదారేళ్లు అమెను లైంగికంగా వాడుకుని, అతడు ఏం చెబితే అది వినేట్టుగా తన ఆధీనంలో పెట్టుకున్నాడని బాధితురాలి తరపున లాయర్ ఆరోపించాడు.

Constant Sexual Assault By Fake Swamiji
నిందితుడు ఆనందమూర్తి

ఇలా వెలుగులోకి.. రెండు రోజుల క్రితం బాధితురాలి నిశ్చితార్థానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు పెళ్లికుమారుడికి బాధితురాలి వీడియోలు, ఫొటోలు పంపి నిశ్చితార్థం ఆగిపోయేలా చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులకు కాల్​ చేసి, వారి కూతురిని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసినా, ఈ విషయం పోలీసుకు చెప్పినా కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు, అతడి భార్యపై రేప్​, ప్రాణహాని, చీటింగ్ నేరాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రేమించలేదని పెట్రోల్ పోసి తగలబెట్టాడు..
ప్రేమించలేదని అమ్మాయిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ ఉన్మాది. తీవ్రంగా గాయపడిన అమ్మాయిని ఆస్పత్రికి తరిలించారు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని దుమ్​​కా జిల్లా జరూహాడీ ప్రాంతలోని సిటీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

అసలేంజరిగిందంటే.. సంజీవ్​ సింగ్​, దుమ్​కా ప్రాంతానికి చెందిన వ్యాపారి. అతనికి అంకిత అనే 12వ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. వీళ్ల ఇంటి సమీపంలోనే షారుఖ్​ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. షారుఖ్​ వేరే వాళ్ల వద్ద నుంచి అంకిత ఫోన్​ నంబర్ తీసుకున్నాడు. అప్పటి నుంచి షారుఖ్, అంకితను ప్రేమించమని ఒత్తిడికి గురిచేస్తున్నాడు. అందుకు అంకిత అంగీకరించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన షారుఖ్​, తన మాట వినకపోతే చంపేస్తానని బెదిరించాడు.

మంగళవారం అంకిత ఇంట్లో నిద్రపోతున్న సమయంలో షారుఖ్​ వచ్చి కిటికీలోంచి ఆమెపై పెట్రోల్​ పోశాడు. తనపై ఏదో పడింది అని అంకిత తేరుకునే లోపే నిప్పంటించాడు. మంటల్లో కాలుతున్న అంకితను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అంకిత కుటుంబ సభ్యులను విచారించారు.

ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని దుమ్​కా డిప్యూటీ ఎస్​పీ నూర్​ ముస్తాఫా అన్నారు. ఈ వన్​ సైడ్​ ప్రేమ వ్యవహారంలో అంకితను, షారుఖ్​ పెట్రోల్​ పోసి చంపాలనుకున్నాడని ఆయన తెలిపారు. ఈ విషయంలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు.

ఇవీ చూడండి: నిద్రిస్తున్న భార్యను లేపి, రైలు కిందకు తోసి హత్య

శ్వేతవర్ణంలో కనువిందు చేసిన అరుదైన సర్పం, ఎక్కడంటే

Last Updated : Aug 23, 2022, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.