ETV Bharat / bharat

విశాఖకు నకిలీ నోట్లు తరలిస్తున్న ముఠా అరెస్ట్!​

ఛత్తీస్​గఢ్ నుంచి విశాఖకు భారీగా నకిలీ నోట్లు తరలిస్తున్న ముఠాను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. రూ.7.90 కోట్లు విలువచేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

fake notes, odisha
ఒడిశాలో 7.9 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం
author img

By

Published : Mar 2, 2021, 8:46 PM IST

నకిలీ నోట్లను తరలిస్తున్న ముఠాను ఒడిశాలో పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. రూ.7.90 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కొరాపుట్‌ జిల్లా పొటాంగి పరిధిలోని సుంకీ అవుట్‌ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ నకిలీ కరెన్సీ ముఠాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

ఛత్తీస్​గఢ్​​ నుంచి విశాఖకు..

నకిలీ నోట్లు తరలిస్తున్న కారుకు ఛత్తీస్‌గఢ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉందని పోలీసులు వెల్లడించారు. రూ.500 ముఖవిలువ గల నోట్లను పెద్ద సంచుల్లో తరలిస్తున్నారని పేర్కొన్నారు. రాయ్‌పుర్‌ నుంచి విశాఖపట్నంలోని వ్యక్తికి నకిలీ నోట్లు అందించేందుకు నిందితులు వెళ్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి : యాక్టివ్​ కేసుల్లో 75 శాతం ఆ రెండు రాష్ట్రాల్లోనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.