fake currency seized: మహారాష్ట్రలోని ముంబయిలో రూ.7 కోట్ల విలువైన నకిలీ నోట్లను పోలీసులు పట్టుకున్నారు. దీనితో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిని అంతర్ రాష్ట్ర ముఠాగా గుర్తించినట్లు పేర్కొన్నారు.
ముందస్తు సమాచారం ప్రకారం ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు నగర శివారుల్లోని దహిసర్ చెక్ పోస్ట్ వద్ద కారును అడ్డగించినట్లు అధికారులు తెలిపారు. కారులో ఉన్న నలుగురిని ముందుగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే వాహనాన్ని తనిఖీ చేయగా అందులో సుమారు 250 కట్టల రూ. 2 వేల నోట్లు ఓ బ్యాగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.
ముందుగా అదుపులోకి తీసుకున్న నలుగురిని పూర్తి స్థాయిలో విచారించగా.. మిగతా ముగ్గురి గురించిన సమాచారం అందించినట్లు అధికారులు వివరించారు. దీంతో సబర్బన్ అంధేరిలోని ఒక హోటల్‌పై పోలీసులు దాడి చేసి మరో ముగ్గురుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి కూడా రూ. 2 కోట్లు విలువు చేసే 100 కట్టల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ముఠా నుంచి నకిలీ నోట్లతో పాటు ల్యాప్‌టాప్, ఏడు మొబైల్ ఫోన్లు, రూ. 28,170 నగదు, ఆధార్, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: రూ.1000 కోట్లకు నకిలీ బిల్లులు.. అకౌంటెంట్ అరెస్టు