ETV Bharat / bharat

యూట్యూబ్​ చూసి దొంగ నోట్లు ప్రింటింగ్- ఇంజినీర్ అరెస్ట్​ - మహారాష్ట్రలో దొంగనోట్ల ముఠా అరెస్ట్

Fake Currency Racket Maharashtra: యూట్యూబ్​లో చూసి దొంగ నోట్లు తయారు చేయడమే కాక వాటిని చలామణి చేస్తున్న ఇంజినీర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,20,000 విలువ గల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

Fake Currency Racket
దొంగనోట్లు ముఠా
author img

By

Published : Dec 30, 2021, 3:55 PM IST

Fake Currency Racket Maharashtra: ఏ విషయమైనా తెలియకపోతే యూట్యూబ్ చూసి నేర్చుకుంటాం. అలా చాలామంది వంటలు, ఇతరత్రా పనులు నేర్చుకుంటారు. కానీ మహారాష్ట్ర, ఔరంగబాద్​కు చెందిన ఓ ఇంజినీర్​ మాత్రం నకిలీ నోట్లను ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. అతనితోపాటు మరో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏమైందంటే..?

ఔరంగబాద్​లోని పుండలీక నగర్​కు చెందిన సమ్రాన్(30) అలియాస్ లక్కీ.. యూట్యూబ్​లో చూసి ఫేక్ నోట్లను తయారు చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఓ గదిలో ప్రింటింగ్ ప్రెస్​ ఏర్పాటు చేశాడు. దొంగ నోట్లు తయారు చేసి చిన్నచిన్న దుకాణాల్లో, బెల్టు షాపుల్లో చలామణి చేశాడు.

పోలీసులకు ఎలా తెలిసింది?

ఎవరో నకిలీ నోట్లు ఇచ్చి లిక్కర్ కొనుగోలు చేశారని పుండలీక నగర్​లోని సూపర్ వైన్స్​ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఏఎస్​ఐ శేష్​రావ్​ ఖటానే బృందం.. వైన్స్ షాపుపై నిఘా పెట్టింది. రంగనాథ్ ధవల్​పుర్ అనే వ్యక్తి.. ఇదివరకే ఓసారి దొంగ నోట్ల చలామణి కేసులో అరెస్టు అయి బెయిల్​పై బయటకు వచ్చాడు. అయితే.. వైన్స్​ షాపు వద్ద రంగనాథ్​ను చూసిన పోలీసులు.. అతడిని విచారించారు. దీంతో సమ్రాన్ అలియాస్ లక్కీ నిర్వహిస్తున్న దొంగ నోట్ల దందా బయటపడింది.

రంగనాథ్​ ఇచ్చిన సమాచారం మేరకు.. పుండలీక నగర్​లోని లక్కీ గదికి చేరుకున్న పోలీసులు.. కలర్ ప్రింటర్లను ధ్వంసం చేశారు. రూ. 1,20,000 నకిలీ కరెన్సీను స్వాధీనం చేసుకున్నారు. లక్కీను అరెస్ట్ చేశారు. అతడితోపాటు నితిన్​ కల్యాణ్​రావ్​(25), అక్షయ్​ అన్నాసాహెబ్​ పదుల్(28), దాదారావ్​ పట్రవ్​ గవాండే(42), రంగనాథ్ ధవల్​పుర్​(49)ను అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: ఆసుపత్రిలో ఫ్లోర్​ తుడిచిన డాక్టర్.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.