కరోనా మూడో దశ ముప్పు నుంచి భారత్ బయటపడినట్టేనా? దీపావళి తర్వాత మూడు వారాలుగా నమోదవుతున్న కరోనా కేసుల సరళిని గమనించి అవుననే చెబుతున్నారు నిపుణులు. కరోనా రెండో దశలో దేశంలో చాలా మంది కరోనా బారినపడటం, వ్యాక్సినేషన్ ఊపందుకోవడం వల్ల మూడో ముప్పు ఉండే అవకాశాలు తక్కువే అంటున్నారు(third wave in india ).
అయితే ఏదైనా కొత్త వేరియంట్ వెలుగు చూస్తే మాత్రం థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు లేకపోలేదని నిపుణులు హెచ్చరించారు. శీతాకాలం ప్రారంభమైనందు వల్ల కేసులు పెరగొచ్చారు. కానీ రెండో దశలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడే సూచనలు కనిపించడం లేదన్నారు(corona third wave).
డిసెంబర్ చివరి నుంచి ఫిబ్రవరి మధ్యలో కరోనా కేసులు పెరగొచ్చు. అయితే రెండో దశలో వేలమంది మరణించి, లక్షలాది మంది ఆస్పత్రులపాలైనట్లుగా ఈసారి తీవ్ర ప్రభావం ఉండదు. దేశవ్యాప్తంగా ఒకే విధంగా కేసుల పెరుగుదల ఉండకపోవచ్చు.
- ప్రొఫెసర్ గౌతమ్ మేనన్, ఆశోకా యూనివర్సిటీ, సోనిపత్.
భారత్లో అక్టోబర్-నవంబర్ మధ్యలో కరోనా థర్డ్ వేవ్ రావచ్చని కొందరు నిపుణులు అంచనా వేశారు(third wave of corona in india ). దసరా, దీపావళి పండగ సీజన్ల వల్ల ప్రజలు గుమిగూడి కేసులు పెరిగే అవకాశముంటుందని భావించారు. కానీ అలా జరగలేదు. క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం కొత్త కేసులు 543 రోజుల కనిష్ఠానికి చేరి 7,579గా నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు కూడా అదే స్థాయిలో పడిపోయాయి. వరుసగా 46 రోజుల పాటు 20వేలకు తక్కువగానే కొత్తగా కేసులు వెలుగు చూశాయి. వరసగా 149 రోజుల పాటు కొత్తగా కొవిడ్ సోకిన వారి సంఖ్య 50వేలకు తక్కువగానే ఉంది(corona third wave news).
కరోనా రెండో దశలో దేశంలో చాలా మంది కరోనా బారినపడటం, ప్రభుత్వం వ్యాక్సిననేషన్ జోరు పెంచడం వల్ల ప్రజలందరికీ కరోనా నుంచి రక్షణ లభిస్తోందని గౌతమ్ మేనన్ అన్నారు. అందుకే ఆస్పత్రులలో చేరేవారు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. కరోనా సోకని వారితో పోల్చితే కరోనా సోకిన వారికి వ్యాక్సిన్ వల్ల మరింత ఎక్కువ రక్షణ లభిస్తుందని వివరించారు. వారిలో హైబ్రిడ్ ఇమ్యూనిటీ వృద్ధి చెందడమే ఇందుకు కారణమన్నారు(third wave news).
ఈశాన్య రాష్ట్రాల్లో...
భారత్లో కరోనా కేసులు తగ్గడం శుభపరిణామమేనని, కానీ మిజోరం వంటి రాష్ట్రాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ఇమ్యూనాజిస్ట్ వినీత బాల్ వివరించారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త కేసుల్లో వృద్ధి నమోదవుతోందన్నారు. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న చోట్ల, ఇన్ఫెక్షన్ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి ఇలానే ఉందని చెప్పారు. ఐరోపా దేశాలు, ఉత్తర అమెరికా దేశాల్లో కేసుల మళ్లీ భారీగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు(Corona third wave india).
ఆర్ వ్యాల్యూ తక్కువే...
భారత్లో కరోనా థర్డ్ వేవ్ సెప్టెంబర్ మధ్యలోనే వచ్చి వెళ్లి ఉంటుందని మరో శాస్త్రవేత్త సితభ్ర సిన్హా పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మళ్లీ రావచ్చన్నారు. కరోనా పాండెమిక్ మొదలైనప్పటి నుంచి ఆర్ వ్యాల్యూను(రీప్రోడక్టివ్ రేట్) పరిశీలిస్తన్నామని వివరించారు. కరోనా యాక్టివ్ కేసులు 1000 కంటే ఎక్కువ ఉన్న మిజోరం, జమ్ముకశ్మీర్లో ఆర్ వ్యాల్యూ ఒకటి కంటే ఎక్కువగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఇది 1 కంటే తక్కువే ఉన్నప్పటికీ ముంబయి, పుణె, చెన్నై, కోల్కతా, వంటి నగరాల్లో మాత్రం 1 కంటే కాస్త ఎక్కువ ఉందని చెప్పారు(corona india ).
ఐసీఎంఆర్ జులైలో నిర్వహించిన సీరో సర్వేలో భారత్లో 67.6శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. కరోనా టీకాకు అర్హులైన వారిలో 82శాతం మంది తొలిడోసు తీసుకోగా.. 43 శాతం మంది రెండు రోడులు పూర్తి చేసుకున్నారు(covid 19 third wave).
ఇదీ చదవండి: బెంగళూరు ఎయిర్పోర్టులో 'రోసెన్బర్' - దక్షిణాసియాలోనే తొలిసారి