ETV Bharat / bharat

'దేశంలో విచ్చలవిడిగా ప్లాస్మా చికిత్స' - కొవిడ్​ రోగులకు ప్లాస్మా చికిత్స

కొవిడ్​ 19 బాధితులకు ప్లాస్మా చికిత్స అందించడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోగనిరోధక సామర్థ్యం తక్కువగా ఉన్న వారికి ప్లాస్మాను ఇస్తే వైరస్​లో కొత్త రకాలు పుట్టుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్లాస్మా చికిత్సను కేంద్రం 'ఆఫ్​ లేబుల్​' అని పేర్కొనడాన్ని విమర్శించారు. ఈ సూచనల కారణంగా చికిత్సను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.

experts on plasma therapy, plasma therapy for covid patients
ప్లాస్మా చికిత్సపై కేంద్రానికి నిపుణుల లేఖ
author img

By

Published : May 12, 2021, 7:37 AM IST

దేశంలో కొవిడ్‌-19 బాధితులకు చికిత్స చేయడానికి కాన్వలసెంట్‌ ప్లాస్మాను ఎలాంటి హేతుబద్ధత లేకుండా, అశాస్త్రీయంగా ఉపయోగిస్తున్నారని పలువురు వైద్యులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు కె.విజయ్‌ రాఘవన్‌కు లేఖ రాశారు. దీనిపై ప్రముఖ టీకా నిపుణురాలు గగన్‌దీప్‌ కాంగ్‌, శస్త్రచికిత్స నిపుణులు పరమేశ్‌ సి.ఎస్‌., భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తదితరులు సంతకాలు చేశారు.

ప్లాస్మా థెరపీలో.. కొవిడ్‌ నుంచి కోలుకున్న బాధితుడి రక్తం నుంచి యాంటీబాడీలను సేకరించి, పరిస్థితి విషమంగా ఉన్న కరోనా రోగులకు ఇస్తుంటారు. ఈ చికిత్సపై కేంద్ర ఆరోగ్య శాఖ గత నెలలో సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. నాటి నుంచే దీనిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వ్యాధి లక్షణాలు ఒక మోస్తరుగా ఉన్నప్పుడు, లక్షణాలు బయటపడ్డ ఏడు రోజుల లోపు ప్లాస్మాను ఇవ్వాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఏడు రోజుల తర్వాత ప్లాస్మాను ఇవ్వకూడదని, అధిక స్థాయిలో యాంటీబాడీలు కలిగిన దాతల ప్లాస్మా లభ్యమైనప్పుడే దాన్ని ఇవ్వాలని సూచించింది. అయితే ఇందులో ప్లాస్మాను 'ఆఫ్‌ లేబుల్‌' విధానంగా పేర్కొంది. ఇది వింతగా ఉందని నిపుణులు తమ తాజా లేఖలో పేర్కొన్నారు. 'ఆఫ్‌-లేబుల్‌' అంటే అనుమతిలేని వినియోగమని వివరించారు. కేంద్రం సూచనల నేపథ్యంలో ప్లాస్మా చికిత్సను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. దీనిపై తక్షణం జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు విజయ్‌ రాఘవన్‌ను కోరారు.

కొత్త రకాలకు ఊతం

రోగనిరోధక సామర్థ్యం తక్కువగా ఉన్న వారికి ప్లాస్మాను ఇచ్చినప్పుడు.. యాంటీబాడీలకు పెద్దగా లొంగని కొత్త కరోనా వైరస్‌ రకాలు పుట్టుకురావొచ్చని ప్రాథమిక పరిశోధన ఫలితాలు చెబుతున్నట్లు నిపుణులు తమ లేఖలో వివరించారు. "దీని ప్రకారం చూస్తే హేతుబద్ధత లేకుండా ప్లాస్మా చికిత్సను చేయడం వల్ల ఉద్ధృతంగా వ్యాపించే వైరస్‌ రకాలు పుట్టుకురావొచ్చు. ఫలితంగా మహమ్మారి విజృంభించొచ్చు. వైద్యులు, ప్రజారోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలుగా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖను రాస్తున్నాం" అని పేర్కొన్నారు.

ఫలితం లేదని తెలిసినా..

కాన్వలసెంట్‌ ప్లాస్మా చికిత్స వల్ల కొవిడ్‌ బాధితులకు ఒనగూరే లబ్ధి ఏ మాత్రం లేదని తాజా పరిశోధనల్లో వెల్లడైనట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ప్లాస్మాకు తీవ్ర కొరత ఉందని చెప్పారు. దాన్ని సంపాదించడానికి బాధితుల తరఫు బంధువులు అగచాట్లు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ చికిత్స విధానంపై 'ఐసీఎంఆర్‌-ప్లాసిడ్‌' పేరుతో దేశవ్యాప్తంగా 39 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రపంచంలోనే తొలిసారిగా 'ర్యాండమైజ్డ్‌ కంట్రోల్డ్‌ ట్రయల్‌'ను నిర్వహించినట్లు తెలిపారు. కొవిడ్‌ లక్షణాలు ఉద్ధృతం కాకుండా ఈ చికిత్స నిలువరించలేదని, మరణాల రేటునూ తగ్గించలేదని వెల్లడైనట్లు చెప్పారు. వెంటిలేటర్‌పై లేని కొవిడ్‌ బాధితులకు దీనివల్ల పెద్ద ఉపయోగం లేదన్నారు. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికా లు కూడా కొవిడ్‌ బాధితులకు సాధారణ పరిస్థితుల్లో ప్లాస్మా చికిత్స చేయవద్దని సూచించినట్లు పేర్కొన్నారు.

మొదటి సారిలాగానే రెండో ఉద్ధృతి: ఐసీఎంఆర్‌

కరోనా మొదటి ఉద్ధృతి తరహాలోనే రెండో ఉద్ధృతి ఉందని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ పేర్కొన్నారు. రెండో విజృంభణలో ఎక్కువ యువత ప్రమాదానికి గురయ్యారన్న వాదనలో వాస్తవం లేదని మంగళవారం దిల్లీలో విలేకరులతో తెలిపారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు తాము డేటా సేకరించి పరిశీలించామని, అలాంటి పరిస్థితేదీ తమకు కనిపించలేదన్నారు. 40 ఏళ్లు పైబడిన వారు ఎక్కువ ఇబ్బందులకు గురైనట్లు చెప్పారు. రెండు ఉద్ధృతుల్లోనూ ఆసుపత్రుల్లో చేరినవారిలో 9.6-9.7% మంది చనిపోయినట్లు వెల్లడించారు. "యువత కొంత ఎక్కువ ప్రభావానికి గురికావడానికి కారణం వైరస్‌ అకస్మాత్తుగా పెరిగిన సమయంలో వారు బయట తిరగడమే" అని అభిప్రాయపడ్డారు. తర్వలో మరికొన్ని రకాల టీకాలు లభ్యమవుతాయన్నారు. నియంత్రణ సంస్థలు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు చిన్నారులకు టీకాలు అందుబాటులోకి వస్తాయని బలరామ్‌ భార్గవ చెప్పారు.

ఇదీ చదవండి : 'వ్యాక్సిన్‌ ఫార్ములా ఇతర సంస్థలతో పంచుకోండి!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.