ETV Bharat / bharat

ఇలాగే కొనసాగితే.. రోజుకు 3 లక్షల కేసులు!

దేశంలో రెండోవిడత కరోనా ఉద్ధృతి మరింత ప్రమాదకరంగా మారనుందా? రోజువారీ కొత్త కేసులు 3 లక్షల వరకు నమోదు కానున్నాయా? టీకా పంపిణీ ప్రారంభంలోనే వ్యాక్సిన్‌ తీసుకోకపోవటమే ప్రస్తుత పరిస్థితికి కారణమా? దేశంలో కరోనా ఉద్ధృతి మరో 45 రోజులు కొనసాగనుందా? అంటే నిపుణులు అవుననే అంటున్నారు. ఇప్పటికైనా తు.చ. తప్పకుండా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, భయాలు లేకుండా టీకా తీసుకుంటే మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

corona
దేశంలో కరోనా విజృంభణ
author img

By

Published : Apr 15, 2021, 10:40 AM IST

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రెండో విడత కరోనా ప్రకంపనలు మే చివరి వరకూ కొనసాగే ప్రమాదమున్నట్లు తెలుస్తోంది. రోజువారీ కేసులు 3లక్షల వరకు నమోదు కానున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం బుధవారం దేశవ్యాప్తంగా 2,00,739 కొత్త కేసులతో అత్యధిక గరిష్ఠస్థాయి నమోదైంది. ఈ కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1.40 కోట్లు దాటింది. తొలిసారి రోజువారీ మరణాలు కూడా అత్యధికంగా నమోదయ్యాయి. 1,038 మరణాలతో మొత్తం సంఖ్య 1,73,123కు పెరిగింది.

అమెరికాను అధిగమిస్తాం..

కొవిడ్‌ కేసుల వృద్ధి రేటుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా తర్వాత ఈ స్థాయిలో రోజువారీ కేసులు నమోదు కావటం భారత్‌లో మాత్రమేనని అంటున్నారు. ఏడు శాతంగా ఉన్న యాక్టివ్‌ కేసుల వృద్ధిరేటు ఇలాగే కొనసాగితే.. రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరుతుందని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో జనవరి 8న రోజువారీ కేసులు 3లక్షల 9వేలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే అత్యధికం. అయితే భారత్‌లో ప్రస్తుతం రోజువారీ కేసులు 2 లక్షలకు చేరువయ్యాయి. వ్యాప్తి ఇలాగే కొనసాగితే.. అమెరికా గరిష్ఠ స్థాయిని అధిగమించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొత్త మ్యూటెంట్ల వల్ల..

1.40 కోట్ల కేసులతో ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండోస్థానంలో భారత్​ ఉంది. క్రియాశీల కేసుల్లో మూడోస్థానంలో ఉన్నట్లు ప్రపంచస్థాయి గణాంకాలు చాటుతున్నాయి. కరోనా వైరస్‌ కొత్త మ్యూటెంట్‌ స్ట్రెయిన్లు ప్రమాదకరంగా మారాయి. కొత్తమ్యూటెంట్ల వల్ల వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పేర్కొంటున్న నిపుణులు.. మరణాల సంఖ్య తక్కువగా ఉంటుందని చెప్పటానికి ఆధారాల్లేవన్నారు. అయితే దేశంలో వ్యాక్సిన్‌ కొరత ఉందన్న ప్రచారాన్ని వారు ఖండిస్తున్నారు.

13 కోట్లకుపైగా డోసులున్నాయ్..

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నెలకు 5 నుంచి 6 కోట్ల డోసులు, భారత్‌ బయోటెక్‌ 2 నుంచి 3 కోట్ల డోసుల టీకాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకూ 31 నుంచి 32 కోట్ల డోసుల టీకాలు తయారుకాగా.. అందులోంచి దేశీయంగా 12 కోట్ల డోసులు పంపిణీ చేశారు. దాదాపు 6.5 కోట్ల డోసులు ఎగుమతి చేశారు. ఇంకా 13 కోట్లకుపైగా డోసుల టీకాలు అందుబాటులో ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవంగా టీకా కొరత లేకున్నప్పటికీ.. ఇతర సమస్యలు ఉండొచ్చని అంటున్నారు.

కట్టడి చర్యల్లో ప్రభుత్వాలు..

కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చర్యలను తీవ్రతరం చేశాయి. పదో తరగతి పరీక్షలను సీబీఎస్​ఈ రద్దుచేయగా.. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. దేశంలోని పలుప్రాంతాల్లో ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూతోపాటు వారాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో 15 రోజులపాటు జనతా కర్ఫ్యూ పేరుతో అత్యంత కఠినమైన ఆంక్షలు విధించారు.

అప్పడు అనుమానాలు.. ఇప్పుడు తొందర..

కొత్త వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వటం ద్వారా.. టీకా పంపిణీ కార్యక్రమం కూడా ఉద్యమరూపం దాల్చనుందని నిపుణులు అంటున్నారు. దేశంలో వ్యాక్సినేషన్‌ మొదలైనప్పుడు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడమే.. ప్రస్తుత పరిస్థితికి దారితీసినట్లు పేర్కొంటున్నారు. వైరస్‌ తగ్గినందున టీకా ఎందుకు వేసుకోవాలనే? ప్రశ్నలు వినిపించాయి. వెంటనే టీకాలు అందుబాటులోకి రావటం వల్ల వాటి భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. అందువల్ల ఆ సమయంలో చాలామంది టీకా తీసుకోలేదని, ఇప్పుడు కేసులు పెరుగుతున్నందున వ్యాక్సిన్‌ కోసం తొందరపడాల్సి వస్తోందన్నారు. ఇది ఎప్పటికైనా సవాలుతో కూడకున్నదనేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా తు.చ.తప్పుకుండా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. భయాలకు లోనుకాకుండా టీకా తీసుకుంటే కరోనా ముప్పు నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:'కరోనా టీకాలు అందుబాటులో ఉంచుతాం!'

ఇదీ చూడండి:మహారాష్ట్రను కలవరపెడుతోన్న 'డబుల్‌ మ్యుటేషన్‌'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.