Exorcism In Hospital ICU: ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్‌గా మారినా.. కొందరు మూఢనమ్మకాలపై అపోహలు మాత్రం వీడటం లేదు. ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా భూతవైద్యాన్ని నమ్మేవారు ఇంకా ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఝార్ఖండ్‌లో వెలుగు చూసింది. పాము కాటుకు గురై ఐసీయూలో చికిత్స పొందుతోన్న ఓ మహిళకు భూతవైద్యుడితో వైద్యం చేయించారు ఆమె కుటుంబసభ్యులు. అయితే ఆ సమయంలో ఆసుపత్రి యాజమాన్యం వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.
ఆంబువా ప్రాంతానికి చెందిన శక్తి నాయక్ భార్య అర్చన దేవి(25) పాము కాటుకు గురైంది. వెంటనే బంధువులు.. ఆమెను గుమ్లా సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు.. మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు రిఫర్ చేశారు. వారు మాత్రం రిమ్స్‌కు వెళ్లకుండా.. సదర్ ఆసుపత్రికి ఓ భూతవైద్యుడ్ని పిలిపించారు. ఆసుపత్రి.. ఐసీయూ బ్లాక్‌లోకి వచ్చిన భూత వైద్యుడు.. సుమారు మూడు గంటలపాటు హైడ్రామా నడిపించాడు. అన్నం తినే ప్లేట్‌ను బాధితురాలి వీపు మీద పెట్టి ఏవో పూజలు చేశాడు. ఆమె శరీరం నుంచి విషం తీసినట్టుగా కాసేపు గిమ్మిక్కులు కూడా చేశాడు. అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో.. సదర్ ఆసుపత్రి వైద్యులంతా అక్కడే ఉండి చూస్తూనే ఉన్నారు తప్ప ఏమీ అనలేదు.
గుమ్లా సదర్ ఆస్పత్రిలో ఇలాంటి ఘటన జరగడం ఇదేం తొలిసారి కాదు. మూడు రోజుల క్రితం పాముకాటుకు గురైన ఓ చిన్నారిని అతడి కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారు కూడా భూతవైద్యుడ్ని పిలిపించి ఆసుపత్రి ఆవరణలోనే భూతవైద్యం చేయించారు.
ఇవీ చదవండి: తల్లి మృతదేహం పక్కనే చిన్నారి నిద్ర.. 5గంటలు అలాగే... ఆకలేస్తోందని విలపిస్తూ..
12ఏళ్ల బాలికపై రేప్.. 27ఏళ్ల తర్వాత నిందితుడు అరెస్ట్.. మైనర్‌పై నలుగురు కలిసి..