సివిల్ సర్వీస్ పరీక్షలో ర్యాంకులు (Civils rank 2021) సాధించి విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi UPSC) అభినందనలు తెలియజేశారు. మీ ముందు నిత్యం ఉత్తేజం కలిగించే ఉద్యోగ జీవితం వేచి ఉందని ఉత్సాహపరిచారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ(Civils results 2021) ట్విట్టర్ వేదికగా స్పందించారు.
విజేతలూ.. మీదే కీలక పాత్ర
"సివిల్స్ పరీక్షలో విజయం సాధించిన మీకు అభినందనలు. ప్రజా జీవితంలో నిత్యం ఉత్తేజం, సంతృప్తి కలిగించే వృత్తిగత జీవితం వేచి ఉంది. ఈ దేశ ప్రయాణంలో ముఖ్యమైన సమయంలో మీరు కీలక పాత్ర పోషించనున్నారు. అలాగే ఈసారి ఉత్తీర్ణత సాధించని వారు నిరుత్సాహపడొద్ద"ని ప్రధాని(Modi tweet on Civil Servants) సూచించారు.
'మీరంతా ప్రతిభావంతులు. మరికొన్నిసార్లు ప్రయత్నించే వీలుంది. అలాగే భారత్ అనేక విభిన్న అవకాశాలకు నెలవు. వాటిని అన్వేషించడానికి వేచి చేస్తోంది. మొత్తానికి మీరు విధించుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఆశిస్తున్నాను' అని అన్నారు.
నిన్న సాయంత్రం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో (Modi UPSC) బిహార్‌కు చెందిన శుభం కుమార్ మొదటి ర్యాంకు సాధించారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు 20వ ర్యాంకు దక్కింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 40 మంది ఎంపికయ్యారు.
ఇదీ చదవండి: