ETV Bharat / bharat

Kodela Awards: చట్టసభల్లో హుందాగా వ్యవహరించడమే కోడెలకు ఇచ్చే నివాళి: వెంకయ్య నాయుడు

Kodela Awards : మాజీ ఉప సభాపతి కోడెల శివప్రసాద్ 75వ జయంతి సందర్భంగా గుంటూరులో నిర్వహించిన సేవా పురస్కారాల కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్​తో కలిసి కోడెల విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల, సినీనటులు బ్రహ్మానందం, గుండె వైద్య నిపుణులు గోపాలకృష్ణ గోఖలే ఈ పురస్కారాలు అందుకున్నారు.

author img

By

Published : May 2, 2023, 9:56 PM IST

Updated : May 2, 2023, 10:28 PM IST

kodela Awards
kodela Awards

Kodela Awards : ఎంచుకున్న రంగం ఏదైనా అత్యున్నత స్థాయిల్లో నిలిచిన వారిని చూసి యువత స్ఫూర్తి పొందాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మాజీ ఉప సభాపతి కోడెల శివప్రసాద్ 75వ జయంతి సందర్భంగా గుంటూరులో నిర్వహించిన సేవా పురస్కారాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్​తో కలిసి కోడెల విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్యనాయుడు తాను పదవీ విరమణ చేసినా.. పెదవి విరమణ చేయలేదని చమత్కరించారు. దేశ, రాష్ట్ర రాజకీయాల గురించి తన అభిప్రాయాలు నిర్మొహమాటంగా చెబుతానని స్పష్టం చేశారు. కోడెల పేరిట విశిష్ట సేవా పురస్కారాలు నేను ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని వెంకయ్య నాయుడు అన్నారు.

kodela Awards

కోడెల మంచి మిత్రుడు.. కోడెల తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచే తనకు మంచి మిత్రుడు అని, సరైన వైద్యం అందక తోబుట్టువులను కోల్పోయిన కోడెల.. పట్టుదలతో వైద్యుడు అయ్యారని తెలిపారు. ఆ తర్వాత ప్రజా సేవ కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసిన కోడెల.. వైద్యుడుగా, రాజకీయ నాయకుడిగా తనదైనముద్ర వేశారని కొనియాడారు. కోటప్పకొండను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తపించారని, ధైర్యం, గుండె నిబ్బరంతో కూడిన రాజకీయాలు చేశారని చెప్పారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోందన్న వెంకయ్య నాయుడు.. చట్ట సభల్లో పద్ధతితో, క్రమశిక్షణతో వ్యవహరించడం కోడెలకు ఇచ్చే నివాళి అని పేర్కొన్నారు.

కృష్ణ ఎల్లా దంపతులకు అభినందనలు... కరోనా వ్యాక్సిన్ కనుక్కోవటంలో కృషి చేసిన కృష్ణ ఎల్ల దంపతులకు వెంకయ్య నాయుడు అభినందనలు తెలిపారు.

బ్రహ్మానందం మనకు గర్వకారణం.. ప్రపంచంలో అత్యధిక సినిమాలు నటించిన బ్రహ్మానందం మనకు గర్వకారణమని అన్నారు. ప్రజాజీవితంలో హ్యూమర్, గ్రామర్ ఉంటే గ్లామర్ వస్తుంది.. అసభ్యతకు తావు లేకుండా నవ్వించటం ఎలాగో బ్రహ్మానందం నటన నిదర్శనం అని వివరించారు. బ్రహ్మానందం కోరిక మేరకు రంగమార్తాండ సినిమా చూశాను.. బ్రహ్మానందం నటన బాగా ఉన్నా విషాద పాత్ర నచ్చలేదని తెలిపారు. ఇకపై అలాంటి పాత్రల జోలికి వెళ్లకుండా హాస్యాన్ని పంచాలని సూచించారు.

తెలుగు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె మార్పిడి చేసిన వైద్యుడు గోపాలకృష్ణ గోఖలే.. 500 మందికి పైగా ఉచితంగా ఆపరేషన్లు చేసిన వ్యక్తి గోఖలేను సన్మానించటం చాలామందికి స్ఫూర్తిదాయకం అని చెప్పారు. యువత తాము ఎంపిక చేసుకున్న రంగాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు.

రాజకీయాలు మారిపోయాయి.. రాజకీయాల్లో టెన్షన్ పెరుగుతోంది.. అటెన్షన్ తగ్గుతోందని వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయ నాయకులు ఒకరికొకరు ప్రత్యర్థులు మాత్రమే శత్రువులు కాదని చెప్తూ.. తనను ఎన్నికల్లో ఓడించిన సుందరరామిరెడ్డి విగ్రహా విష్కరణకు హాజరైనట్లు గుర్తు చేశారు. ప్రత్యర్థులను గౌరవించాలనేందుకు ఇది నిదర్శనం అని పేర్కొన్నారు. బూతులు మాట్లాడే నాయకులకు పోలింగ్ బూత్ స్థాయిలో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. గతంలో సభలకు జనం స్వచ్ఛందంగా వచ్చి అర్ధరాత్రి వరకూ ఉండేవారని, ఇప్పుడు జనాల్ని సభలకు తోలాల్సి వస్తోందని, వచ్చిన వారు వెళ్లకుండా బారికేడ్లు పెట్టి ఆపుతున్నారు.. ఇది మంచి పరిణామం కాదని పేర్కొన్నారు. బస్సు, బ్రాందీ, బిర్యానీ.. అంటూ త్రీ బీ ఫార్ములా అమలు చేయాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మోజు అనే భావ దారిద్య్రం నుంచి త్వరగా బయటకు రావాలి.. మాతృభాషలో మాట్లాడటం తప్పకుండా అలవర్చుకోవాలి.. మధురమైన యాసలు ఉన్న భాష మన తెలుగు అని వెంకయ్య నాయడు తనదైన శైలిలో కీర్తించారు.

కోడెల సలహా పాటిస్తున్నాం.. భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల మాట్లాడుతూ కోడెల వైద్య మంత్రిగా ఉన్నప్పుడు ఓ టెండర్ రాలేదని.. ఆ విషయమై నేరుగా వెళ్లి కలిస్తే.. రూల్స్ ప్రకారం వెళ్లాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. వ్యాపారం, రాజకీయాలకు ముడి పెట్టవద్దని ఆయన ఇచ్చిన సలహా ఇప్పటికీ పాటిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం నుంచి చాలా ఆఫర్లు వచ్చినా.. వందల కోట్లు ఖర్చు అయినా వెనుకాడకుండా కొవిడ్​ వాక్సిన్ ఆవిష్కరించామని వెల్లడించారు.

పురస్కారం రావడం సంతోషంగా ఉంది.. భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల మాట్లాడుతూ.. కోడెల విశిష్ట సేవా పురస్కారం అందుకోవటం సంతోషంగా ఉందన్నారు. గతంలో కోడెల నరసరావుపేట ఆహ్వానించారని, ఆ సందర్భంగా కోడెల చేతుల మీదుగా మహిళా పారిశ్రామికవేత్త అవార్డు తీసుకున్నానని తెలిపారు. భారత్ బయోటెక్ ఏర్పాటు చేసినప్పుడు అభినందించారని చెప్పారు. మహిళా పార్లమెంటు ఏర్పాటు చేసినప్పుడు కూడా పిలిచారని గుర్తు చేసుకున్నారు.

పల్నాటి పులి కోడెల... ప్రజల్ని నవ్వించి ఆరోగ్యం పంచే డాక్టర్ వని కోడెల అనేవారంటూ బ్రహ్మానందం పాత జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. కోడెల పుట్టిన గడ్డ పల్నాడులో పుట్టి పెరిగాను.. కోడెల ఎప్పుడు కనిపించినా ఏమ్మా అని ఆప్యాయంగా పలకరించేవారని తెలిపారు. పదవులు ఉన్నా లేకపోయినా సామాన్యుడిగా జీవించారని, కోడెల విశిష్ట సేవా పురస్కారం వచ్చిందని తెలియగానే మనసులో చాలా ఆనందం కలిగిందని వెల్లడించారు. మన పల్నాడు వాళ్ల అంత పెడసరం ఎవరికీ ఉండదు.. మాట తీరు ఎలా ఉన్నా.. మనసు వెన్న అని చెప్తూ.. కోడెల కూడా వెన్న లాంటి మనసు గల వ్యక్తి.. పల్నాటి పులి అని అభిమానులు సంతోషంగా పిలుస్తారని అని తెలిపారు. వెంకయ్యనాయుడు మనకు అద్భుత రోల్ మోడల్.. చిన్నప్పుడు తల్లిని కోల్పోయినా.. భారతమాత చంకన కూర్చున్న వ్యక్తి వెంకయ్యనాయుడు అని కీర్తించారు. ప్రముఖ గుండెవైద్యనిపుణులు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే మాట్లాడుతూ.. కోడెల ఎప్పుడు కనిపించినా ఆత్మీయంగా మాట్లాడే వారని అన్నారు. గుండె మార్పిడి శస్త్రచికిత్సల కోసం జీజీహెచ్​లో పూర్తి తోడ్పాటు అందించారని తెలిపారు.

కోడెల ఆశయాలను సాధించాలి.. కోడెల శివరాం మాట్లాడుతూ.. కోడెల గారి మీద అభిమానంతో వెంకయ్యనాయుడు ఇక్కడకు వచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. సమాజానికి మంచి చేయాలని కోడెల నిరంతరం తపించారని, సామాజిక సేవల్లో రెండు గిన్నిస్ రికార్డులు సాధించారని వెల్లడించారు. స్పీకర్ హోదాలో మహిళా పార్లమెంటు నిర్వహించి మహిళాభ్యుదయానికి మార్గదర్శనం చేశారని చెప్పారు. పేదలకు అండగా నిలవటం కోసం నిరంతరం శ్రమించిన కోడెల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు.

ఇవీ చదవండి :

Last Updated : May 2, 2023, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.