ETV Bharat / bharat

కాంగ్రెస్​కు 'ఈవీఎం' ట్యాంపరింగ్​ భయం.. కార్యకర్తలతో కాపలా!

EVM tampering: పోలింగ్​ అనంతరం ఓట్ల లెక్కింపు వరకు ఈవీఎంలను ఓ స్ట్రాంగ్​ రూమ్​లో పెట్టి.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంది ఎన్నికల సంఘం. 24 గంటలు తుపాకులు పట్టుకుని జవాన్లు పహారా కాస్తారు. అయితే, ఈవీఎంలను భద్రపరిచిన గది వద్ద కాంగ్రెస్​ కార్యకర్తలు కాపలా కాస్తున్న సంఘటన ఉత్తరాఖండ్​ ఖటిమా నియోజకవర్గంలో జరిగింది. అందుకు కారణం ఏంటి?

EVM tampering
ఈవీఎంల స్ట్రాంగ్​ రూమ్​ వద్ద కాపలా
author img

By

Published : Feb 21, 2022, 6:47 PM IST

EVM tampering: ఉత్తరాఖండ్​ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ ఈనెల 14న ముగిసింది. మార్చి 10న ఓట్ల లెక్కింపు. అప్పటివరకు ఈవీఎంలను భద్రపరిచేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. అయితే, ఆ ఈవీఎంలను ట్యాంపరింగ్​ చేస్తారనే భయం కాంగ్రెస్​ పార్టీలో నెలకొంది. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి హరీశ్​ రావత్​ సైతం ఈవీఎంలను భాజపా ట్యాంపరింగ్​ చేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ కారణంగా రాష్ట్రంలోని ఖటిమా నియోజకవర్గ కాంగ్రెస్​ అభ్యర్థి.. ఏకంగా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్​ రూమ్​ వద్ద తమ కార్యకర్తలను కాపలాగా పెట్టారు.

ఆయన గెలుపు కోసం..

కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ భువన్​ కాపడీ.. ఖటిమా నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్​ సింగ్​ ధామీపై పోటీ చేశారు. ధామీ గెలుపు కోసం భాజపా ఈవీఎంలు ట్యాంపరింగ్​ చేస్తుందని అనుమానాలు వ్యక్తం చేశారు భువన్. ఉధమ్​ సింగ్​ నగర్​ జిల్లాలోని రుద్రపుర్​ బగవాఢా మండిలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్​ రూమ్​ వద్ద రాత్రింబవళ్లు కార్యకర్తలను కాపలాగా ఏర్పాటు చేశారు​. స్ట్రాంగ్​ రూమ్​ ముందు ఓ టెంటు ఏర్పాటు చేసుకుని ముగ్గురు కార్యకర్తలు.. మూడు షిఫ్టుల ప్రకారం పహారా కాస్తున్నారు.

ఉధమ్​ సింగ్​ నగర్​ జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన 1488 ఈవీఎంలను రుద్రపుర్​లో భద్రపరిచారు అధికారులు. మూడంచెల భద్రత, సీసీటీవీలు ఏర్పాటు చేశారు. ఈమేర భద్రత ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్​ భయపడటం గమనార్హం.

ఇదీ చూడండి: మోదీ-యోగికి ప్రజా సమస్యలు పట్టవు: సోనియా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.