బంగాల్లో మూడో విడత పోలింగ్ జరుగుతున్న వేళ.. ఉలుబెడియా ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో నాలుగు ఈవీఎంలు, వీవీప్యాట్లు కనిపించడం కలకలం రేపింది. ఓటింగ్ యంత్రాల్ని టీఎంసీ గౌతమ్ ఘోష్ దాచడానికి ప్రయత్నించారని భాజపా నేత చిరన్ బేరా ఆరోపించారు.
ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఆ నియోజకవర్గ సెక్టార్ అధికారిని సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఇదీ చదవండి: 'భారీగా తరలిరండి.. ఓట్లు వేయండి'